Saturday, November 1, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలునవ కేరళ..నవోదయం

నవ కేరళ..నవోదయం

- Advertisement -

దారిద్య్ర రహిత తొలి రాష్ట్రంగా ఘనకీర్తి
రాష్ట్ర అవతరణ దినోత్సవాన నేడు సగర్వంగా ప్రకటన
‘నవతెలంగాణ’తో ప్రత్యేక ఇంటర్వ్యూలో సీఎం పినరయి విజయన్‌
ములాఖాత్‌


ప్రపంచమంతా కేరళ వైపు చూస్తోంది. విద్య, వైద్యారోగ్యం, ఐటి, సహకార రంగం, పారిశ్రామిక ప్రగతి, మౌలిక సదుపాయాలు, ప్రజాసంక్షేమం, సామాజిక చైతన్యం ఇలా అన్ని రంగాల్లోనూ దేశానికి నవ కేరళ..నవోదయంగా కొత్త వెలుగునిస్తోంది. వామపక్ష ప్రజాతంత్ర ఫ్రంట్‌ (ఎల్‌డీఎఫ్‌) ప్రభుత్వం ప్రజా వికాసానికి అనేక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే దుర్భర దారిద్య్రాన్ని సంపూర్ణంగా పారద్రోలి దేశంలోనే ఈ ఘనత సాధించిన మొట్టమొదటి రాష్ట్రంగా కేరళ ఘనకీర్తి పొందుతోంది.

ఈ మేరకు కేరళ రాష్ట్ర అవతరణ దినోత్సవాన (నవంబరు 1) ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రకటన చేయనున్నారు. పకడ్బందీ ప్రణాళికతో కూడిన పరిశోధన, సర్వే, జాగ్రత్తగా పరిశీలించి చేసిన కచ్చితమైన అమలు, ప్రజా ప్రాతినిధ్యం, వివిధ విభాగాలు సమన్వయంతో చేసిన కృషి.. ఫలితంగానే ఇది సాధ్యమైంది. ‘నవతెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అద్వితీయమైన నవ కేరళ ప్రగతి ప్రస్థానంపై విజయన్‌ వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

దారిద్య్ర విముక్త రాష్ట్రంగా కేరళను ప్రకటించడం ద్వారా ప్రపంచానికి ఇచ్చే సందేశం ఏమిటి?
నవంబరు 1న కేరళను పేదరిక నిర్మూలనం జరిగిన రాష్ట్రంగా ప్రకటించనున్నారు. తద్వారా స్థానిక స్వపరిపాలనా సంస్థలు, సమాజం, వివిధ ప్రభుత్వ శాఖల సమిష్టి కృషి, సహకారంతో దారిద్య్రాన్ని, దుర్భర దారిద్య్రాన్ని కూడా ఒక ప్రాంతం నుండి పూర్తిగా పారద్రోలవచ్చని ప్రపంచానికి బలమైన సందేశాన్ని ఇస్తుందన్నారు. ”దారిద్య్రం, ఆకలి నుండి విముక్తి జరగాలన్న ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని పూర్తిగా సాధించిన తొలి రాష్ట్రంగా కేరళ నిలవనుంది. ఎవరినీ వెనుకబడనివ్వకుండా అభివృద్ధి సాధించడం సాధ్యమేనన్న విషయాన్ని ఈ విజయం మనకు గుర్తు చేస్తుంది.

ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం 2.0 తొలి క్యాబినెట్‌ తీసుకున్న ప్రధానమైన నిర్ణయాల్లో దుర్భర దారిద్య్ర నిర్మూలనా కార్యక్రమం ఒకటి. ఈ దిశగా గత నాలుగేండ్ల నుంచి సాగిన ప్రయాణం ఎలా వుంది?
దుర్భర దారిద్య్రంలో జీవిస్తున్న కుటుంబాలను కనుగొని, వారిని ఆ పరిస్థితుల నుండి బయటపడవేసే లక్ష్యంతో 2021లో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. స్థానిక స్వ పరిపాలనా సంస్థలు సవివరమైన సర్వే నిర్వహించాయి. 64,006 కుటుంబాలను తీవ్రమైన పేదరికంలో జీవిస్తున్నవిగా సర్వే గుర్తించింది. ఆదాయం, ఆరోగ్యం, ఆహారం, ఇల్లు వంటి అంశాలను ప్రాతిపదికగా చేసుకుని ఈ సర్వే జరిగింది. తదనుగుణంగా ప్రతి ఒక్క కుటుంబానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. స్థానిక స్వపరిపాలనా సంస్థలు, కుటుంబశ్రీ, లైఫ్‌ మిషన్‌, ఆరోగ్యం, ఇతర ప్రభుత్వ విభాగాల మద్దతుతో ఈ సూక్ష్మ ప్రణాళికలను అమలు చేశారు.

ఈ ప్రాజెక్టు తొలి ఏడాదిలో, సర్వే చేయబడిన జాబితాలోని 47.89 శాతం జనాభా దారిద్య్రం నుండి బయటపడ్డారు. ఈ ఏడాది సెప్టెంబరు 16 నాటికి ఈ కార్యక్రమం వర్తింపచేసిన కుటుంబాల్లో 53,699 కుటుంబాలు (84 శాతం) దుర్భర దారిద్య్రం నుండి బయటకు వచ్చాయి. దుర్భర దారిద్య్రాన్ని గుర్తించే సమయంలో దుర్భర దారిద్య్ర రేఖ పరిధిలోకి వారిని చేర్చి ఆ తర్వాత మరణించిన వారిని, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళిన వారిని, జాబితాలో రెండుసార్లు పేర్లు వచ్చిన వారిని, సూక్ష్మ ప్రణాళిక అవసరం లేని వారిని దీన్నుండి మినహాయి ంచారు. ఆ రకంగా 55861 కుటుంబాలు (96.13 శాతం) దుర్భర దారిద్య్రం నుండి విముక్తి పొందాయి. తొలి ఏడాదిలో, ఆహారం, ఆరోగ్య సంరక్షణ వంటి అత్యంత కీలకమైన, అనివార్యమైన కారణాలపై ప్రభుత్వం అధికంగా దృష్టి కేంద్రీకరించింది. దీనికి తోడు, అవకాశం అతివేగం క్యాంపెయిన్‌ కింద 21,263 మంది నిరుపేదలకు ఓటర్‌ ఐడి, ఆధార్‌, రేషన్‌ కార్డు, ఆరోగ్య బీమా, వికలాంగ గుర్తింపు కార్డులు, బ్యాంక్‌ అకౌంట్లు, ఉపాధి కార్డులు, ఎమర్జన్సీ సేవలు వంటి అవసరాలు, హక్కులను కల్పించారు.

రాష్ట్ర ప్రభుత్వం అంకిత భావంతో, సమిష్టిగా చేసిన కృషి వల్ల సామాజిక భద్రతా సంస్థలు, స్థానిక స్వ పరిపాలనా సంస్థలు ఆహారం, ఆరోగ్యసేవలు నిరంతరంగా అవసరం వున్న వారికి తమ మద్దతునం దించాయి. అవసరంలో వున్న కుటుంబాలకు సామాజిక భద్రతా పెన్షన్‌ అందించారు. ఇళ్ళు లేని కుటుంబాలకు లైఫ్‌ మిషన్‌ గృహ నిర్మాణ పథకాన్ని అందించింది. కుటుంబశ్రీ అమలు చేసే ఉజ్జీవనం పథకం ద్వారా జీవనోపాధి, రెగ్యులర్‌ ఆదాయానికి హామీ కల్పించబడింది. చాలావరకు, లబ్దిదారులకు భూమి, ఇల్లు, లేదా ఇల్లు మరమ్మతులు అవసరంగా వున్నాయి. ఇప్పటివరకు కేవలం ఇల్లు మాత్రమే అవసరమైన 4677 కుటుంబాలకు ఇళ్ళు నిర్మించుకోవడానికి ఆర్థిక తోడ్పాటు అందచేశారు, ఆ ఇళ్లు కూడా పూర్తయ్యాయి. ఇంటి స్థలం కూడా లేని 2713 కుటుంబాలకు స్థలం కేటాయించడమే కాకుండా ఇల్లు కూడా నిర్మించి ఇచ్చారు. 5646 ఇండ్లను పునరుద్ధరించారు. ఇల్లు మరమ్మతులు చేసుకోవాల్సిన కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటు అందించారు.

మొత్తంగా దీన్ని సాధించడానికి చేపట్టిన సన్నాహాలు ఏంటి ?
దుర్భర దారిద్య్ర నిర్మూలనకు సన్నాహాలను వివిధ దశల్లో చేపట్టాం. మొదటగా, భయంకరమైన దారిద్య్రంలో బతుకుతున్న వారిని గుర్తించేందుకు స్థానిక స్వపరిపాలనా సంస్థలు సవివరమైన సర్వే నిర్వహించాయి. తొలి దశలో, ప్రతి కుటుంబం ఆహారం,ఆరోగ్యం, ఆదాయం, ఇంటి అవసరాలను అంచనా వేయడం ద్వారా స్థానికంగా సమాచార సేకరణను నిర్వహించారు. ఇక రెండో దశలో, ప్రతి ఒక్క కుటుంబం అవసరాలను ప్రాతిపదికగా చేసుకుని స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్ధం చేశారు. ఇక మూడో దశలో ప్రాజెక్టు అమలు. స్థానిక స్వపరిపాలనా సంస్థలు, కుటుంబశ్రీ, లైఫ్‌ మిషన్‌, ఆరోగ్య శాఖ, ఎన్‌జిఓలు, రెసిడెంట్‌ అసోసియేషన్లు సహా వివిధ ప్రభుత్వ విభాగాల మద్దతుతో స్థానిక స్వపరిపాలన శాఖ ఈ ప్రాజెక్టును అమలు చేస్తోంది. ఈ ప్రాజెక్టులో ప్రధాన భాగం నిధులు. ఈ ప్రాజెక్టు కోసం 2023-24, 2024-25 సంవత్సరాలకు రూ.50 కోట్లు చొప్పున ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులను ఆరోగ్యం, గృహ నిర్మాణం, జీవనోపాధి వంటి వాటికి వినియోగించారు. ఈ ఏడాది రూ.60 కోట్లు కేటాయించారు.

ధర్మాధామ్‌ భారతదేశంలోనే తొలి దుర్భర దారిద్య్ర విముక్తి నియోజకవర్గంగా మారింది. ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఈ విజయాన్ని మీరు ఎలా చూస్తారు?
దుర్భర దారిద్య్రం నుండి బయటపడిన తొలి నియోజకవర్గంగా ధర్మాధామ్‌ ఖ్యాతి నొందడమంటే.. ఇదేమీ వ్యక్తిగత విజయం కాదని నేను స్పష్టంగా చెప్పదలచుకున్నాను. అయితే, ఇదంతా సమాజంలోని అన్ని తరగతుల సమిష్టి కృషితో సాధించిన ఫలితమేనన్నారు. ఈ విజయంలో అత్యంత కీలకమైన అంశం ఏమంటే ఎల్‌ఎస్‌జిడి సంస్థల మద్దతుతో ఎల్‌ఎస్‌జిడి విభాగం సాగించే సమిష్టి కృషి, ఆరోగ్య, ఇతర విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు, కుటుంబశ్రీ, లైఫ్‌ మిషన్‌, అన్నింటికంటే ఈ నియోజకవర్గ ప్రజలు. అత్యంత భయంకరమైన దారిద్య్రం నుంచి బయటపడిన రాష్ట్ర హోదాను సాధించేందుకు కేరళ సాగించిన ప్రయాణానికి ఇదొక అద్భుతమైన నమూనా. అలాగే ఇతర నియోజకవర్గాలకు, రాష్ట్రాలకు ఇది ఒక అదర్శప్రాయమైన నమూనా. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఇదొక ఉదాహరణ. అందరికీ ఆరోగ్యం, ఆహారం, జీవనోపాధి, ఇండ్లు, విద్యకు హామీ కల్పించబడింది. ప్రజల జీవన ప్రమాణాల అభ్యున్నతికి, అలాగే అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా చూసేందుకు ప్రభుత్వం ఎలా కట్టుబడి వుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ.

మానవ వికాసంలో, ఇంకా అనేక అభివృద్ధి ప్రాధాన్యతల్లో కేరళ దేశంలోకెల్లా నెంబర్‌ వన్‌గా వుంది. కానీ, చాలా ప్రచార సంస్థలు డేటాను పట్టించుకోవడం లేదు. ఇందుకు ఉదాహరణ.. ‘ది కేరళ స్టోరీ’ చిత్రం, జాతీయ గుర్తింపు దృష్ట్యా దానికి వచ్చిన మద్దతు. దేశంలోకెల్లా కేరళను పెద్దగా అర్ధం చేసుకున్నది తక్కువ అని మీరు అనుకుంటున్నారా?

మానవ వికాస సూచీలో, ఇతర అభివృద్ధి ప్రాధాన్యతల్లో కేరళ దేశంలో కెల్లా నెంబర్‌ వన్‌ స్థానంలో వుందన్నది వాస్తవం. అక్షరాస్యత, మెరుగైన ఆరోగ్య సంరక్షణ, శిశు మరణాలు తక్కువగా వుండడం వంటి అనేక రంగాల్లో కేరళ ఉన్నత అధిరోహాలు సాధించింది. అయితే, జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించిన ‘ది కేరళ స్టోరీ’ చిత్రం వంటి కొన్ని ప్రచారాలు కేరళకు సంబంధించిన ఈ అభివృద్ధి ప్రచారాలకు ఏ మాత్రమూ సంబంధం లేకుండా నిర్దిష్ట వైఖరులను ప్రచారం చేసే ప్రయత్నాల్లో భాగం కావచ్చు. ఇందుకు రెండు కారణాలు వుండవచ్చు. మొదటిది, అభివృద్ధి నమూనాపై భిన్నమైన అభిప్రాయాలు. ఒక వర్గం ప్రజలు కేరళ అభివృద్ధి నమూనాను ఆమోదిస్తున్నారు.

అదే సమయంలో మరొక వర్గం ప్రజలు దీన్ని అభివృద్ధి కోణంలో కాకుండా భిన్నమైన రాజకీయ లేదా సామాజిక కోణంలో చూసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రచార వ్యూహాల ప్రభావం మరో కారణం. సామాజిక మాధ్యమాలు, సినిమా వంటి కళా రూపాల ప్రభావం సమాజంలో చాలా ఎక్కువగా వుంటుంది. ఈ మాధ్యమాల ద్వారా వ్యాప్తి చెందే కథలు తరచుగా వాస్తవిక పరిస్థితుల కన్నా కూడా ప్రజల భావోద్వేగాలను ప్రభావితం చేస్తాయి. అటువంటి ప్రయత్నాలు జాతీయ స్థాయిలో కేరళను భిన్నంగా చూపించవచ్చు, కానీ అది వాస్తవికతకు చాలా దూరం. కేరళను సక్రమంగా దేశంలో అర్థం చేసుకున్నారా? లేదా? అంటే నేను నిర్దిష్టంగా సమాధానం ఇవ్వలేను. అయితే, అభివృద్ధి, వాస్తవికతలను మించి నిర్దిష్ట కథనాలు సమాజాన్ని ఏ రీతిన ప్రభావితం చేస్తాయనడానికి ఈ పరిస్థితి ఒక సూచిక.

ఐక్యరాజ్య సమితి 2030కల్లా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్‌డీజీ) సాధించాలని నిర్దేశించుకుంది. ఆర్థికంగా, సామాజికంగా, పర్యావరణపరంగా సుస్థిరమైన అభివృద్ధి సాధిస్తూనే అన్ని రూపాల్లోని దారిద్య్రాన్ని, లేమిని అంతం చేయాలన్నది మొట్టమొదటి లక్ష్యంగా వుంది. దారిద్య్రాన్ని నిర్మూలించ డానికి బదులుగా దుర్భర దారిద్య్రాన్ని నిర్మూలించడంపైనే కేరళ ఎందుకు దృష్టి కేంద్రీకరించింది?
దారిద్య్రాన్ని నిర్మూలించడంలో కేరళ బృహత్తర పురోగతి సాధించింది. 1973-74లో దారిద్య్రం 59.8 శాతంగా వుండేది. 2019-21లో ఇది 0.55 శాతానికి పడిపోయింది. అందువల్ల తదుపరి దశలో, సమాజంలోని అత్యంత నిరుపేద వర్గాల అభ్యున్నతిపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. దుర్భరమైన దారిద్య్రం నుండి వారిని బయటపడవేసేందుకు వారికి సాయమందించే చర్యలు తీసుకుంది. ఇది, ‘దుర్భర దారిద్య్రాన్ని నిర్మూలించే’ లక్ష్యం వైపునకు దారి తీసింది.

దుర్భరమైన పేదరికం అనేది కనిపించని దారిద్య్రం. దీన్ని గుర్తించడం చాలా కష్టం. ఎక్కడా ఎప్పుడూ కూడా లెక్కలోకి రాని ఈ కనిపించని పేదలను అభివృద్ది పథంలోకి తీసుకురావడం ప్రభుత్వానికి ఎంత ముఖ్యం ?
దుర్భరమైన దారిద్య్రంలో జీవిస్తున్నవారిని గుర్తించడమనేది నిజంగా ఒక సవాలు. అందుకే ప్రభుత్వం ఒక విశిష్టమైన పద్ధతిని ఆమోదించింది. నిరుపేదలను గుర్తించేందుకు కుటుంబాల స్థాయిలో డేటాను సేకరించాలని భావించింది. ఆరోగ్య సమస్యలు, పోషకాహార లోపం, ఆదాయ లేమి, తల దాచుకునే ఆశ్రయం లేకపోవడం వంటి దుర్భరమైన దారిద్య్రానికి దారి తీసే కారణాల ప్రాతిపదికన ఇదంతా జరిగింది. రేషన్‌ కార్డులు, ఆధార్‌ కార్డులు, ఆరోగ్య కార్డులు తదితర ముఖ్యమైన గుర్తింపు కార్డులను వేగంగా జారీ చేసేలా అవకాశం అతివేగం క్యాంపెయిన్‌ రూపొందించబడింది. ఈ కార్డులు వారికి ఇతర సంక్షేమ సేవలను సులభంగా అందుకునేందుకు సాయపడతాయి. ఆ రకంగా కంటికి కనిపించని దారిద్య్రాన్ని ప్రభుత్వం పరిష్కరించింది.

మౌలిక వసతుల అభివృద్ధి, సంక్షేమ చర్యల మధ్య సమతూక పాలన కోసం ప్రభుత్వం అనుసరించే వ్యూహాలు ఏంటి ?
దుర్భరమైన దారిద్య్రాన్ని నిర్మూలించే ప్రాజెక్టులో మీరు చూసినట్లైతే, లైఫ్‌ మిషన్‌ ద్వారా గృహ నిర్మాణం వంటి మౌలిక వసతుల కల్పనకు, అలాగే ఆరోగ్యం, ఆహార పంపిణీ, విద్యాసాయం వంటి సంక్షేమ చర్యలు, ఉజ్జీవన పథకం ద్వారా ఉపాధి అవకాశాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వబడింది. దీనితో పాటూ రోడ్‌ నెట్‌వర్క్స్‌, వాటర్‌ మెట్రో, కెఎస్‌ఆర్‌టిసి పునరుద్ధరణ వంటి అభివృద్ది పనులకు ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది.అభివృద్ధి పట్ల మేం సమగ్ర దృక్పథాన్ని కలిగి వున్నాం.

కుటుంబశ్రీ ఒక జాతీయ నమూనా. దుర్భరమైన దారిద్య్రాన్ని పారద్రోలే లక్ష్యాన్ని సాధించడంలో కుటుంబశ్రీ పాత్ర ఏమిటి?
భయంకరమైన పేదరికాన్ని సమూలంగా నిర్మూలించే ప్రయత్నాల్లో కుటుంబశ్రీ కీలక పాత్ర పోషించింది. కుటుంబశ్రీ మద్దతుతో ఉజ్జీవనం పేరుతో ఒక పథకాన్ని ప్రారంభించాం. ఈ ప్రాజెక్టు ద్వారా తీవ్రమైన పేదరికాన్ని అనుభవిస్తున్న కుటుంబాలకు ఉపాధి శిక్షణ, మైక్రో ఫైనాన్స్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సాయం అందచేయబడింది. జనకీయ హోటళ్ళ ద్వారా కుటుంబశ్రీ ఆహారాన్ని పంపిణీ చేసింది. కుటుంబశ్రీ ఉజ్జీవనం ప్రాజెక్టు ద్వారా 4394 కుటుంబాలకు ఆదాయ వనరు కల్పించబడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -