ఉద్యోగుల బకాయిలు రూ.712 కోట్లు క్లియర్
ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్
శాఖ పెండింగ్ బిల్లులు రూ.320 కోట్లు విడుదల
డిప్యూటీ సీఎం ఆదేశంతో బిల్లులు చెల్లించిన ఆర్థిక శాఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ శాఖకు సంబంధించిన పెండింగ్ బిల్లులు అక్టోబర్ మాసానికి సంబంధించి సుమారు రూ.1,031 కోట్లను ఒకేసారి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశం మేరకు ఆర్థిక శాఖ అధికారులు విడుదల చేశారు. శుక్రవారం ఉదయం ప్రజాభవన్‌లో ఆర్థిక శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వ కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బకాయిలను దశలవారీగా ప్రతినెలా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క క్లియర్ చేస్తూ వస్తున్నారు.
అందులో భాగంగా అక్టోబర్ మాసానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు రూ.712 కోట్లను డిప్యూటీ సీఎం ఆదేశం మేరకు ఆర్థిక శాఖ అధికారులు విడుదల చేశారు. అదే విధంగా రూ.10 లక్షల లోపు పెండింగ్‌లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ శాఖకు సంబంధించి 46,956 బిల్లుల తాలూకు రూ.320 కోట్లను అధికారులు విడుదల చేశారు. రోడ్లు, భవనాల శాఖకు చెందిన రూ.10 లక్షల్లోపు విలువ గల 3,610 బిల్లుల మొత్తం సుమారు రూ.95 కోట్లను ఆర్థిక శాఖ అధికారులు విడుదల చేశారు. అదేవిధంగా పంచాయతీరాజ్, గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించిన 43,364 బిల్లుల మొత్తం రూ.225 కోట్లను సైతం విడుదల చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.
రూ.1,032 కోట్లు ఒకేసారి విడుదలకు డిప్యూటీ సీఎం ఆదేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



