నవతెలంగాణ-చౌటకూర్
మండలంలోని సుల్తాన్‌పూర్ జేఎన్టీయూహెచ్ క్యాంపస్ హాస్టల్‌లో ఓ విద్యార్థి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం జరిగింది. కళాశాల విద్యార్థులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. సూర్యాపేట జిల్లా సిరికొండ మండలం పెద్దరాజు తండాకు చెందిన విద్యార్థి భానోత్ మహేందర్ (20) జేఎన్‌టీయూ సుల్తాన్‌పూర్‌లో సీఎస్‌ఈ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. రోజు మాదిరిగానే శుక్రవారం మహేందర్ మధ్యాహ్న భోజనం ముగించుకొని హాస్టల్‌లోని తన రూమ్‌కు వెళ్లాడు. కొద్ది సేపటి తర్వాత రూంకు తిరిగి వచ్చిన తోటి విద్యార్థులు.. మహేందర్ ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నది గమనించి కేర్ టేకర్‌కు సమాచారం అందించారు.
కేర్‌టేకర్ రూమ్‌లోకి వెళ్లి చూసి, వెంటనే ప్రిన్సిపల్‌కు సమాచారం అందించాడు. ప్రిన్సిపల్ విశ్వనాథం మహేందర్‌ను కిందికి దింపి యూనివర్సిటీ అంబులెన్స్‌లో సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిశీలించిన డాక్టర్లు.. విద్యార్థి మృతి చెందినట్టు నిర్ధారించారు. అనంతరం తల్లిదండ్రులకు, పోలీసులకు ప్రిన్సిపల్ సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్, జోగిపేట సీఐ అనిల్ కుమార్, పుల్కల్ ఎస్‌ఐ విశ్వజన్, క్లూస్ టీం వచ్చి రూంను పరిశీలించి ఆధారాలు సేకరించారు. అనంతరం డీఎస్పీ సత్తయ్య గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆందోల్ ఆర్డీవో పాండు, చౌటకూర్ తహసీల్దార్ కిష్టయ్య, ఆర్‌ఐ ప్రమోద్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రిన్సిపల్ విశ్వనాథంతో జరిగిన సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు.
జేఎన్టీయూహెచ్ సుల్తాన్‌పూర్ క్యాంపస్ హాస్టల్‌లో విద్యార్థి ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



