Sunday, November 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమహిళ ఆత్మహత్య!

మహిళ ఆత్మహత్య!

- Advertisement -

ఎస్‌ఐ వేధింపులే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ
వెంపటి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం

నవతెలంగాణ -తుంగతుర్తి
అవమానభారంతో మహిళ ఆత్మహత్య చేసుకోగా.. అందుకు ఎస్‌ఐ వేధింపులే కారణమని బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి గ్రామంలో శుక్రవారం ఉదయం వెలుగుజూసింది. మృతురాలి కుమార్తెలు సరిత, అనిత, కుమారుడు మహేష్‌ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. 15 రోజుల కిందట వెంపటి గ్రామానికి చెందిన సోమనర్సమ్మ(50) బావ మల్లయ్య ఇంట్లో బంగారం పోయిందని, ఆమెపై నెపం నెట్టి తుంగతుర్తి పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై గ్రామానికి చెందిన కొంతమంది పెద్దమనుషులు, మల్లయ్య కలిసి పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లారు.

పోలీసులు సోమనర్సమ్మను విచారణ నిమిత్తం తీసుకెళ్లి గురువారం రాత్రి 8 గంటల వరకు తుంగతుర్తి పోలీస్‌ స్టేషన్‌లోనే ఉంచారు. ఎస్‌ఐ క్రాంతికుమార్‌ ఆమెను వేధింపులకు గురిచేశారు. ”నిన్ను జైలుకు పంపుతాం.. నీవే దొంగతనం చేసినట్టు ఒప్పుకో.. ఫింగర్‌ ప్రింట్స్‌ ఉన్నాయి’ అంటూ బెదిరించారు. ఆ తర్వాత ఇంటికొచ్చిన సోమనర్సమ్మ అవమానం భరించలేక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై ఎస్‌ఐని వివరణ అడగడానికి ‘నవతెలంగాణ’ విలేకరి ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. సోమనర్సమ్మ ఆత్మహత్యతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఎస్‌ఐ క్రాంతి కుమార్‌పై పోలీస్‌ ఉన్నతాధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -