Saturday, November 1, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపెండ్లి వాహనాన్ని ఢీకొట్టిన బోర్వెల్‌ డీసీఎం

పెండ్లి వాహనాన్ని ఢీకొట్టిన బోర్వెల్‌ డీసీఎం

- Advertisement -

ముగ్గురు మృతి.. 9మందికి గాయాలు
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో ఘటన

నవతెలంగాణ-భీమదేవరపల్లి
మరు పెండ్లికి వెళ్లి తిరిగి వస్తున్న బొలెరో వాహనాన్ని బోర్వెల్‌ డీసీఎం ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతిచెందిన దగా 9మందికి గాయాలైన ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామ హైవే రోడ్డుపై శుక్రవారం జరిగింది. ముల్కనూర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం సూదన్‌పల్లి గ్రామానికి చెందిన నాగలక్ష్మికి సిద్దిపేట జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన భాస్కర్‌తో అక్టోబర్‌ 29న సూదన్‌పల్లిలో పెండ్లి జరిగింది. అనంతరం పెండ్లి కుమారుడు భాస్కర్‌ గ్రామం వెంకటాపురంకు వెళ్లారు. మరు పెండ్లి కోసం పెండ్లి కుమారుని ఇంటికి పెండ్లి కుమార్తె బంధువులు అక్టోబర్‌ 30న వెళ్లారు.

అదే రోజు తిరు ప్రయాణమయ్యారు. కాగా, హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామ శివారు హైవే రోడ్డు పక్కన కొంతసేపు తమ బొలెరో వాహనాన్ని ఆపుకున్నారు. కాగా, అదే రోడ్డుపై వెనుక నుంచి వస్తున్న బోర్‌వెల్‌ డీసీఎం వారి వాహనాన్ని ఢకొీట్టింది. ఈ ఘటనలో రెడ్డబోయిన స్వప్న(16), రెడ్డబోయిన శ్రీనాథ్‌(6), రెడ్డబోయిన కళమ్మ(55) అక్కడికక్కడే మృతిచెందారు. అనసూయ, మారుతి, రమాదేవి, దేవేందర్‌, నవలోక్‌ రిత్విక్‌, సరోజన, కార్తీక్‌కు తీవ్ర గాయాలు కాగా ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవ్యక్తి శ్రీరామ్‌ రాజు వరంగల్‌ గార్డియన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బోర్వెల్‌ డీసీఎంను అతివేగంగా, అజాగ్రత్తగా నడిపిన డ్రైవర్‌ గడ్డం నాగరాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ రాజు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -