Sunday, November 2, 2025
E-PAPER
Homeబీజినెస్సుమధుర గ్రూప్‌'బ్రాండెడ్‌ క్లబ్‌హౌస్‌' ఏర్పాటు

సుమధుర గ్రూప్‌’బ్రాండెడ్‌ క్లబ్‌హౌస్‌’ ఏర్పాటు

- Advertisement -

హైదరాబాద్‌ : ప్రముఖ రియాల్టీ డెవలపర్‌ సుమధుర గ్రూప్‌ ఆధునిక కమ్యూనిటీ జీవనాన్ని పునర్నిర్వచించడానికి హైదరాబాద్‌లో బ్రాండెడ్‌ క్లబ్‌హౌస్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఫైనాన్సీయల్‌ డిస్ట్రిక్‌లోని సుమదుర్‌ అల్ట్రా లగ్జరీ ప్రాజెక్టు పాలైస్‌ రాయల్‌ నివాస సముదాయంలో ఐలెసియా క్లబ్స్‌ భాగస్వామ్యంతో దీన్ని ఆవిష్కరించింది. ఇక్కడ క్రీడలు, ఫిట్‌నెస్‌, వెల్‌నెస్‌, వినోదంలో ప్రత్యేక చొరవ అని తెలిపింది. దీంతో హైదరాబాద్‌, బెంగళూరులోని ప్రీమియం రెసిడెన్షియల్‌ కమ్యూనిటీలలో తొలి బహుళ నగర బ్రాండెడ్‌ క్లబ్‌హౌస్‌ను ప్రారంభించినట్లయ్యిందని సుమధుర గ్రూప్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మధుసూదన్‌ జి తెలిపారు.

సెలబ్రిటీలు, వ్యాపారస్తుల మనసులను 35 ఏళ్లుగా గెలుచుకుంటున్నామన్నారు. ‘హైదరాబాద్‌ ఒక ప్రపంచ ఆర్థిక శక్తి కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఇది అత్యధిక, అధిక సంపన్నులు, ఎన్‌ఆర్‌ఐలు, అంతర్జాతీయ నిపుణులను ఆకర్షిస్తోంది. ఈ నగరం అల్ట్రా లగ్జరీ నివాసాలకు అపూర్వమైన డిమాండ్‌ను అందిస్తోంది. ప్రతిష్టాత్మక చిరునామా కంటే వారు మరికొన్ని ఆశిస్తున్నారు. డిజైన్‌, వెల్‌నెస్‌, జీవనశైలిలో అంతర్జాతీయ ప్రమాణాలను కోరుకుంటున్నారు,” అని మధుసూదన్‌ జి తెలిపారు. ”భారతదేశపు వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణ కేంద్రాలలో ఒకటిగా హైదరాబాద్‌ ఉండటంతో పాటు ఆధునిక గృహ కొనుగోలుదారుల అభివృద్ధి చెందుతున్న ఆకాంక్షలను ప్రతిబింబిస్తుంది” అని ఐలెసియం క్లబ్స్‌ ఫౌండర్‌ పవిత్‌ సింగ్‌ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -