Thursday, May 15, 2025
Homeతెలంగాణ రౌండప్చిన్నారికి ఏ పాజిటివ్ రక్తం అందజేత..

చిన్నారికి ఏ పాజిటివ్ రక్తం అందజేత..

- Advertisement -

ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు..
నవతెలంగాణ – కామారెడ్డి
: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన కార్తీక్ (8) చిన్నారికి తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి ఏ పాజిటివ్ రక్తం అవసరం అని వారి కుటుంబ సభ్యులు సంప్రదించారు. వారికి కావలసిన రక్తాన్ని తలసేమియా, సికిల్ సెల్ సొసైటీ ద్వారా అందజేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ.. ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో 200 మంది చిన్నారులు తల సేమియా వ్యాధితో బాధపడుతున్నారని, వారికి ప్రతి 15 రోజులకు యూనిట్ రక్తం అవసరం ఉంటుందని తెలిపారు. అలాంటి వారి చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసమే మెగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది చిన్నారులు ఈ వ్యాధితో బాధపడుతున్నారని, వేసవికాలం కావడంతో కావలసిన రక్తం దొరకకపోవడంతో వారి ప్రాణాలకే ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారు. మానవతా దృక్పథంతో స్పందించి రక్తదానానికి ముందుకు వచ్చి చిన్నారుల ప్రాణాలను కాపాడాలని ఈ సందర్భంగా రక్తదాతలకు పిలుపునిచ్చారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -