Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతును ఆదుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం అండ: కలెక్టర్

రైతును ఆదుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం అండ: కలెక్టర్

- Advertisement -

 నవతెలంగాణ – వనపర్తి :   రైతులు కష్టకాలంలో ఉన్నప్పుడు వారిని ఆదుకుని, నష్టాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఖీమ్య నాయక్ తెలిపారు. శనివారం వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రానికి చెందిన రైతు ఆర్ చంద్రయ్య కు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన రూ. 1.50 లక్షల చెక్కును అదనపు కలెక్టర్ అందజేశారు.  అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి జిల్లా కోతకోట మండలం చెందిన ఆర్. చంద్రయ్య అనే రైతుకు సంబందించిన రైతు 25 మేకలు ఆగష్టు 7న, గులికల మందు తినడంతో మరణించాయి. చనిపోయిన  మేకలకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని ఆయన జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు చేసుకున్నారన్నారు. రైతు వినతిని పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వ తరఫున రైతుకు రూ.1.5 లక్షల సి.ఎం.ఆర్.ఎఫ్ మంజూరు చేయించి చెక్కును అందజేసినట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -