Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా రాష్ట్ర మంత్రి జన్మదిన వేడుకలు

ఘనంగా రాష్ట్ర మంత్రి జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ- క్రిష్ణ : తెలంగాణా రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి జన్మ దిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. నారాయణపేట జిల్లా కృష్ణ మండల కేంద్రంలో  మండల యువజన అధ్యక్షుడు షేక్ సర్ఫరాజ్, సీనియర్ యువజన నాయకులు పల్లె సురేష్ ఆయా గ్రామాల నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మంత్రికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు ఒకరికొకరు కేకును తినిపించుకున్నారు. ఈ సందర్భంగా వాకిటి శ్రీహరి ఆయురారోగ్యాలతో వందేళ్లు జీవించాలని క్షీరాలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు, అదేవిధంగా హిందూపూర్, కుసుమూర్తి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోటు బుక్, పెన్నులను స్వీట్ లను అందజేశారు. కార్యక్రమంలో శంకర్ రెడ్డి గౌడ, గౌరప్ప, సకీరప్ప, తిమ్మన్న, అబ్దుల్ ఆసిఫ్, తమప్ప, సబ్జార్ అలీ, బీమ్సి, నాగప్ప, హనుమేష్, తారేష్, శంకర్, బాబు కృష్ణ, సుదర్శన్, మహేష్, లక్ష్మణ్, రంగప్ప, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -