నవతెలంగాణ – కామారెడ్డి: ఖమ్మం జిల్లాలో సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు సామినేని రామారావు ను హత్య చేసిన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలనీ సీపీఐ(ఎం) కామారెడ్డి జిల్లా కమిటీ నుండి డిమాండ్ చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాల తో ప్రజా ఉద్యమాలను ఆపలేరనీ ఖమ్మం జిల్లా లో సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు సామినేని రామారావు హత్య ఘటన అత్యంత ఆందోళన కలిగించే విధంగా ఉందనీ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు. జిల్లా సీపీఐ(ఎం) కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సామినేని రామారావు మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అనేక ప్రజా ఉద్యమాలకు రైతాంగ ఉద్యమాలకు నాయకత్వం వహించిన రామారావు ఖమ్మం జిల్లా చింతకాని మండలం, పాతర్లపాడు గ్రామాల్లో నిన్న తెల్లవారుజామున కాంగ్రెస్ మూకల కిరాయి గుండాలు అత్యంత కిరాతకంగా హత్య చేయడం జరిగిందన్నారు.
సీపీఐ(ఎం) పార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శిగా, పార్టీ జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. పాతర్లపాడు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గా రెండు సార్లు ప్రజాప్రతినిధిగా పనిచేశారనీ, గ్రామంలో రాజకీయంగా సీపీఐ(ఎం) ను ఎదుర్కోలేని కాంగ్రెస్ గుండాలు కిరాయి గుండాలతో చoపించారనీ, సౌమ్యుడు ప్రజలలో కలిసి పోయే మనిషిగా పేరు ఉండి అనేక ఉద్యమాలు రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు ఉమ్మడిగా నిర్వహించిన సందర్భంలో అంకితభావంతో పనిచేశారని పేర్కొన్నారు. ఆయన మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్ గౌడ్, మోతిరం, కొత్త నర్సింలు జిల్లా కమిటీ సభ్యులు రేణుక, ముదాం అరుణ్ లు ఉన్నారు.



