Sunday, November 2, 2025
E-PAPER
Homeఆటలుపంత్‌ అజేయ అర్థ సెంచరీ

పంత్‌ అజేయ అర్థ సెంచరీ

- Advertisement -

బెంగళూరు : రిషబ్‌ పంత్‌ (64 నాటౌట్‌, 81 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీతో కదం తొక్కాడు. దక్షిణాఫ్రికా-ఏతో నాలుగు రోజుల టెస్టులో భారత్‌-ఏ 275 పరుగుల ఛేదనలో గెలుపు దిశగా సాగుతోంది. సాయి సుదర్శన్‌ (12), ఆయుశ్‌ మాత్రె (6), దేవదత్‌ పడిక్కల్‌ (5) విఫలమయ్యారు. రజత్‌ పాటిదార్‌ (28, 87 బంతుల్లో 5 ఫోర్లు), రిషబ్‌ పంత్‌ (64, 81 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) నాల్గో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నమోదు చేశారు. రజత్‌ అవుటైనా.. ఆయుశ్‌ బదోని (0 నాటౌట్‌)తో కలిసి మూడో రోజు ఆట ముగిసేసరికి పంత్‌ అజేయంగా నిలిచాడు. భారత్‌-ఏ 39 ఓవర్లలో 4 వికెట్లకు 119 పరుగులు చేసింది. భారత్‌-ఏ విజయానికి మరో 156 పరుగుల దూరంలో ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -