Sunday, November 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఎల్‌ఐసీలో విజిలెన్స్‌ అవేర్‌నెస్‌ వారోత్సవాలు

ఎల్‌ఐసీలో విజిలెన్స్‌ అవేర్‌నెస్‌ వారోత్సవాలు

- Advertisement -

హైదరాబాద్‌ : లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) శనివారం విజిలెన్స్‌ అవేర్‌నెస్‌ వారోత్సవాలను నిర్వహించింది. హైదరాబాద్‌ జోనల్‌ ఆఫీస్‌ పరిధిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ డివిజనల్‌ ఆఫీస్‌లోని అన్ని కార్యాలయాల ఉద్యోగులు, ఏజెంట్లు భాగస్వామ్యమ య్యారు. ఈ వాకథాన్‌ను జోనల్‌ ఆఫీసు వద్ద ఎపీి, టీజీ రీజినల్‌ మేనేజర్‌ (మార్కెటింగ్‌) ఎం రవి కుమార్‌ జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌, మింట్‌ కాంపౌండ్‌, సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌, ప్రసాద్స్‌ ఐమాక్స్‌, లుంబినీ పార్క్‌ మీదుగా నడిచి ఎల్‌ఐసి జోనల్‌ ఆఫీస్‌ వద్ద ముగించారు.

ఈ మార్గం అంతా విజిలెన్స్‌ అవగాహనపై సందేశాలను ప్లకార్డులు ద్వారా ప్రదర్శించారు. ”ఎల్‌ఐసీ రోజువారీ కార్యకలాపాలలో విజిలెన్స్‌ కోణంపై లోతైన అవగాహన కలిగి ఉండాలి. అవినీతిని అరికట్టడంలో ముఖ్యమైన పాత్రను పోషించాలి.” అని జోనల్‌ మేనేజర్‌ పునీత్‌ కుమార్‌ తమ సిబ్బందికి సూచించారు. చెడు ప్రభావాల గురించి ప్రజలలో అవగాహన కల్పించడమే దీని లక్ష్యమని జోనల్‌ విజిలెన్స్‌ అధికారి ఇ విద్యాధర్‌ పేర్కొన్నారు. ఈ వాకథాన్‌లో ఎల్‌ఐసి సీనియర్‌ అధికారులు పిజి కుమార వైద్యలింగం, శరవణ రమేష్‌, ఎఎఎం హిలాలి, జి మధుసూధన్‌, కె సంధ్యారాణి ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -