Sunday, November 2, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఆర్థిక సహకారం బలోపేతం

ఆర్థిక సహకారం బలోపేతం

- Advertisement -

అపెక్‌ డిక్లరేషన్‌ పిలుపు
జియోంగ్జు (దక్షిణ కొరియా) : సుస్థిర భవిష్యత్తు కోసం సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలనే అంశంపై రెండు రోజులుగా జరిగిన అపెక్‌ (ఆసియా-పసిఫిక్‌ ఆర్థిక సహకారం) సదస్సు శనివారంతో ముగియడంతో అపెక్‌ నేతలు ఉమ్మడి డిక్లరేషన్‌ను ఆమోదించారు. ”నేడు ప్రపంచ దేశాలు కీలకమైన మలుపులో నిలిచిన తరుణంలో, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థ గణనీయమైన సవాళ్ళను ఎదుర్కొంటోంది.

అదే సమయంలో పరివర్తనా సాంకేతికతలు వేగవంతమైన పురోగతి సాధించడం, జనాభాలో మార్పులు ఇవన్నీ కలిసి అపెక్‌ సభ్య దేశాల ఆర్థిక వ్యవస్థలకు తీవ్రమైన, దీర్ఘకాలిక పర్యవసానాలను కలిగిస్తున్నాయి.” అని జియోంగ్జు డిక్లరేషన్‌ పేర్కొంది. అందరికీ లబ్ది చేకూర్చేలా ఆర్థిక వృద్ధి సాధించేందుకు సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని, నిర్దిష్ట కార్యాచరణ చేపట్టాలని డిక్లరేషన్‌ పిలుపిచ్చింది. ఈ డిక్లరేషన్‌తో పాటూ అపెక్‌ నేతలు విడివిడిగా రెండు డాక్యుమెంట్లను ఆమోదించారు. అందులో ఒకటి అపెక్‌ కృత్రిమ మేథస్సు చొరవ కాగా రెండోది జనాభా మార్పులకు సంబంధించిన అపెక్‌ సహకార ఫ్రేమ్‌వర్క్‌.

వచ్చే ఏడాది షెంజాన్‌ ఆతిథ్యం
వచ్చే ఏడాది నవంబరులో జరిగే అపెక్‌ ఆర్థిక నేతల సదస్సుకు చైనా నగరం షెంజాన్‌ ఆతిథ్యమివ్వనున్నట్లు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ శనివారం ప్రకటించారు. 32వ అపెక్‌ ఆర్థిక నేతల సమావేశంలో అపెక్‌ ఛైర్మన్‌ బాధ్యతలను అప్పగించే సమయంలో ఈ ప్రకటన చేశారు. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో అపెక్‌ అత్యంత ముఖ్యమైన ఆర్థిక సహకార యంత్రాంగం అని జిన్‌పింగ్‌ నొక్కిచెప్పారు. ప్రాంతీయ వృద్ధికి, సంక్షేమానికి అపెక్‌ గణనీయమైన సేవలందించిందన్నారు. దీర్ఘకాలిక అభివృద్ధికే కాకుండా ఈ ప్రాంత సంక్షేమానికి కూడా ఇది చాలా కీలకమన్నారు. ఉమ్మడి భవిష్యత్తుతో కూడిన ఆసియా-పసిఫిక్‌ కమ్యూనిటీని నిర్మించేందుకు అన్ని పక్షాలతో కలిసి పనిచేయడానికి చైనా సుముఖంగా వుందన్నారు. సభ్య దేశాల నేతలందరూ కూడా చైనా అభిప్రాయానికి మద్దతునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -