నవతెలంగాణ -ముధోల్: ముధోల్ మండలంలోని కారేగాం గ్రామంలో శనివారం రాత్రి ఎల్లమ్మ ఆలయంలో గుర్తుతెలియని దొంగలు దొంగతనం కు పాల్పడ్డారు. స్థానికులు , ఆలయ నిర్వాహకుల కధనం ప్రకారం… ఎల్లమ్మ ఆలయం తాళం పగులగొట్టి అమ్మవారి మెడలో ఉన్న మంగళసూత్రం, వెండి కన్నులతోపాటు, అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలు, సుమారు రెండు వెయిల నగదు, దొంగలు ఎత్తుకెళ్లారు. అలాగే ఆలయం ముందర ఉన్న హుండీని దొంగలు తాళం పగులగొట్టి దొంగతనం కు ప్రయత్నించినప్పటికీ హుండీ తెరుచుకోలేదు పోవటం తో వదిలి వేళ్ళి పోయారని గ్రామస్థులు తెలిపారు. ఆదివారం ఉదయం ఆలయం కు గ్రామస్థులు వెళ్ళటంతో ఈ విషయం బయట పడింది.ఈ చోరి ఘటనపై ముధోల్ ఎస్ఐ బిట్ల పెర్సిస్ ను ఆదివారం మధ్యాహ్నం ఫోన్ లో నవతెలంగాణ వివరణ కోరగా దొంగతనం జరిగిన విషయం తన దృష్టికి రాలేదన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి పిర్యాదు అందలేదని చెప్పారు.
కారేగాం ఎల్లమ్మ ఆలయంలో దొంగతనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



