-సుధీర్‌బాబు
సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’. ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా నిర్మించారు. శిల్పా శిరోధ్కర్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం ఈనెల 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ,’సుధీర్ బాబు అంటే ఎవరు? ఈ ప్రశ్న నన్ను నేను చాలాసార్లు అడిగాను. కృష్ణ అల్లుడు, మహేష్ బాబు బావ. ఇది నేను గర్వంగా, ప్రేమగా ఒప్పుకుంటున్నాను.
నేను యాక్టర్ అవ్వాలనుకున్న మూమెంట్ తలచుకుంటే భయమేస్తుంది. ఎందుకంటే కోరిక ఎంత బలంగా ఉందో రెస్పాన్సిబిలిటీ కూడా అంతే ఉంది. యాక్టర్‌గా సక్సెస్ అవుతానా? ప్రేక్షకులు నన్ను యాక్సెప్ట్ చేస్తారా? ఇలా చాలా భయాలు ఉండేవి. కాకపోతే నేను మొండి వాడిని. ఒక స్పోర్ట్స్ పర్సన్‌ని. మా ఇంట్లో అమ్మానాన్న ప్రయత్నించడమే నేర్పించారు. ఆగిపోవడం ఎప్పుడూ నేర్పించలేదు. గెలిచే వరకు కూడా పోరాడాలి. లేదా చచ్చే వరకు పోరాడాలి. ‘జటాధర’లో డైలాగ్ ఇది. నా రియల్ లైఫ్‌లో కూడా యూజ్ అవుతుంది. ఒక్క సినిమా చాలు అనుకున్న వాడిని 20 సినిమాలు చేశాను. అందులో హిట్లు, ప్లాపులు ఉన్నాయి.
ఈ 20 సినిమాల్లో హిట్టుకు కారణం నా కష్టం. ఫ్లాప్‌కి కారణం కూడా అది నా ఫెయిల్యూరే. మహేష్ హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నా, ఏ ఒక్క రోజు కూడా హెల్ప్ చేయమని అడగలేదు. ఈ 20 సినిమాలు చేయడానికి కారణం ఒక్కటే. కృష్ణ అల్లుడు, మహేష్ బావ.. సుధీర్ బాబు. చాలా మంది నెపోకిడ్ అని అంటున్నారు. నిజానికి అలాంటిది ఏమీ లేదు. ఇవన్నీ మనస్పూర్తిగా మీతో చెప్పాలనిపించింది. నేను చేసిన 20 సినిమాల్లో ది బెస్ట్ స్క్రిప్ట్ ఇది. సినిమా చూస్తున్నప్పుడు మీకే అర్థమవుతుంది. ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి క్యారెక్టర్ ఏ హీరో చేయలేదు. ఘోస్ట్ హంటర్ క్యారెక్టర్‌లో కనిపిస్తాను’ అని తెలిపారు.
ఏ హీరో చేయని క్యారెక్టర్ చేశా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



