దక్షిణాఫ్రికా-ఏపై భారత్-ఏ గెలుపు
బెంగళూర్ : దక్షిణాఫ్రికా-ఏతో తొలి అనధికార (4 రోజుల) టెస్టులో భారత్-ఏ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 275 పరుగుల లక్ష్యాన్ని భారత్-ఏ 73.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ రిషబ్ పంత్ (90, 113 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఛేదనలో తనదైన ఇన్నింగ్స్‌తో రాణించాడు. లోయర్ ఆర్డర్‌లో ఆయుశ్ బదొని (34), తనుశ్ కొటియన్ (23), మానవ్ (20 నాటౌట్), అన్షుల్ (37 నాటౌట్) సమయోచిత ఇన్నింగ్స్‌లు ఆడారు. సఫారీ-ఏ వరుసగా 309, 199 పరుగులు చేయగా.. భారత్-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 234 పరుగులే చేసింది. 8 వికెట్లు సహా ఛేదనలో 23 పరుగులు చేసిన తనుశ్ కొటియన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
రెండో మ్యాచ్‌కు కుల్‌దీప్ : 6 నుంచి ఆరంభం కానున్న దక్షిణాఫ్రికా-ఏతో రెండో అనధికార టెస్టులో స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ ఆడనున్నాడు. ప్రస్తుతం ఆసీస్ పర్యటనలో ఉన్న కుల్‌దీప్ యాదవ్.. తక్షణమే బయల్దేరి స్వదేశం రానున్నాడు. మహ్మద్ సిరాజ్, రాహుల్, ధ్రువ్ జురెల్, ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ సైతం రెండో అనధికార టెస్టులో ఆడనున్నారు.



