Monday, November 3, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంకరేబియన్‌ సముద్ర జలాల్లో నౌకలపై సైన్యం దాడి

కరేబియన్‌ సముద్ర జలాల్లో నౌకలపై సైన్యం దాడి

- Advertisement -

ముగ్గురు మృతి : అమెరికా ప్రకటన
వాషింగ్టన్‌ :
కరేబియన్‌ సముద్ర జలాల్లో డ్రగ్స్‌ స్మగ్లర్లపై అమెరికా సైన్యం మరో ప్రాణాంతక దాడి చేసిందని రక్షణ కార్యదర్శి పీట్‌ హెగ్సెత్‌ శనివారం ప్రకటించారు. ఈ నౌకను అమెరికాకు చెందిన ఉగ్రవాద సంస్థ నడుపుతోందని సోషల్‌మీడియా పోస్ట్‌లో పీట్‌ హెగ్సెత్‌ పేర్కొన్నారు. అయితే ఏ సంస్థ అనే వివరాలను వెల్లడించలేదు. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులు మరణించారని అన్నారు. ఈ నౌక ఇతర నౌకల్లాగానే డ్రగ్స్‌ను స్మగ్లింగ్‌ చేస్తోందని తమ నిఘా వర్గాలు గుర్తించాయని, కరేబియన్‌ సముద్ర జలాల్లో అక్రమ మార్గంలో పయనిస్తోందని ఆయన తెలిపారు. సెప్టెంబర్‌ ప్రారంభం నుంచి కరేబియన్‌ లేదా తూర్పు పసిఫిక్‌ సముద్ర జలాల్లో అమెరికా సైన్యం నిర్వహించిన 15వ దాడి ఇది. ఇప్పటి వరకు సైన్యం దాడుల్లో సుమారు 64మంది మరణించారు. ఈ దాడులను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సమర్థించుకున్నారు. అమెరికాలోకి డ్రగ్స్‌ ప్రవాహాన్ని అరికట్టడాన్ని సైన్యం తీవ్రతరం చేసిందని అన్నారు. దాడికి గురైన నౌకలు, డ్రగ్స్‌ ముఠాలతో నౌకలకు ఉన్న సంబంధం, దాడుల్లో మరణించిన వ్యక్తుల గురించిన వివరాలను ట్రంప్‌ యంత్రాంగం వెల్లడించలేదు. తమ వాదనలకు మద్దతుగా ఆధారాలను కూడా చూపలేదు. ఈ ప్రాంతంలో ట్రంప్‌ యంత్రాంగం అసాధారణంగా పెద్ద సంఖ్యలో యుద్ధనౌకలను మోహరించిన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -