– ట్రంప్‌పై తీవ్ర విమర్శలు
వాషింగ్టన్ : న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జోహ్రాన్ మమ్దానికి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫోన్ చేశారు. ఆయన ప్రచారాన్ని ప్రశంసించారు. మమ్దానీ గెలిస్తే తాను ‘సలహాదారు (సౌండింగ్ బోర్డ్)’గా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఒబామా చెప్పారు. ఈ విషయాన్ని మమ్దానీ ప్రతినిధి డోరా పెకెక్ ధృవీకరించారు. జోహ్రాన్ మమ్దానీ.. ఒబామా చెప్పిన మద్దతు మాటలను ఎంతో అభినందించారనీ, నగరానికి కొత్త రాజకీయ సంస్కృతిని తీసుకురావాల్సిన అవసరంపై వారిద్దరి మధ్య చర్చ జరిగిందని ఆయన వివరించారు.
న్యూజెర్సీ డెమోక్రాటిక్ గవర్నర్ అభ్యర్థి మైకీ షెరిల్‌తో కలిసి ఒబామా శనివారం ప్రచారం చేశారు. అదే రోజు ఆయన వర్జీనియా గవర్నర్ అభ్యర్థి అబిగైల్ స్పాన్‌బెర్గర్ కోసం జరిగిన ర్యాలీలో కూడా పాల్గొన్నారు. ఈ రెండు రాష్ట్రాల గవర్నర్ అభ్యర్థులకు మద్దతిస్తూ ఎన్నికల ప్రచార ర్యాలీల్లో పాల్గొన్న ఒబామా.. ట్రంప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వచ్చే వారం జరగబోయే ఎన్నికల్లో ట్రంప్ ప్రభుత్వంలోని చట్టరహితం, నిర్లక్ష్యం లను తిరస్కరించాలని ఓటర్లను ఆయన కోరారు. నిజాయితీగా చెప్పాలంటే.. మన దేశం, మన విధానాలు ఇప్పుడు చాలా చీకటి దశలో ఉన్నాయని వర్జీనియాలోని ప్రచారంలో ఒబామా ఆరోపించారు. ట్రంప్ టారిఫ్ విధానం, నేషనల్ గార్డ్‌ను నగరాల్లోకి పంపడం వంటి చర్యలు అస్తవ్యస్తమైనవని చెప్పారు. ట్రంప్‌ను నియంత్రించడంలో విఫలమైన రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యులపైనా ఆయన విమర్శలు సంధించారు.
మమ్దానీ ప్రచారానికి ఒబామా ప్రశంస
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



