Monday, November 3, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంక్రైస్తవులపై హింస కొనసాగితే..

క్రైస్తవులపై హింస కొనసాగితే..

- Advertisement -

నైజీరియాలో దాడులు చేస్తాం : ట్రంప్‌
వాషింగ్టన్‌ :
నైజీరియాలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా ఖండించారు. క్రైస్తవులకు వ్యతిరేకంగా జరుగుతున్న హింసకు ప్రతిగా నైజీరియాలో దాడులు చేస్తామని శనివారం హెచ్చరించారు. సర్వ సన్నద్ధంగా ఉండాలని రక్షణ (యుద్ధ) శాఖకు ఆదేశాలు జారీ చేశారు. క్రైస్తవులపై సాగుతున్న హత్యాకాండను నైజీరియా ప్రభుత్వం అనుమతించిన పక్షంలో దానికి అందజేస్తున్న అన్ని రకాల సాయాన్ని తక్షణమే నిలిపివేస్తానని ఆయన సామాజిక మాధ్యమం ద్వారా తెలియజేశారు. ఇలాంటి భయానక దాడులు జరుపుతున్న ఇస్లామిక్‌ ఉగ్రవాదులను పూర్తిగా తుడిచిపెడతామని స్పష్టం చేశారు. అయితే ఆ ఉగ్రవాద గ్రూపులేమిటో ఆయన వివరించలేదు. ‘మేము కనుక దాడి చేస్తే అది వేగవంతంగా, తీవ్రంగా ఉంటుంది. నైజీరియా ప్రభుత్వం వేగంగా కదలడం మంచిది’ అని ట్రంప్‌ తన పోస్టులో సూచించారు. కాగా ట్రంప్‌ హెచ్చరికలపై నైజీరియా ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. నైజీరియాను తమ విదేశాంగ శాఖ ‘ఆందోళన కలిగించే దేశాల’ జాబితాలో చేర్చుతుందని ట్రంప్‌ శుక్రవారం ప్రకటించారు. ఇదిలావుండగా అల్లర్లను అదుపు చేయడానికి మరిన్ని ప్రయత్నాలు చేయాలని మానవ హక్కుల బృందాలు నైజీరియా ప్రభుత్వాన్ని కోరాయి. బోకో హరామ్‌, ఇతర సాయుధ గ్రూపులు ప్రాణాంతక దాడులకు పాల్పడుతుండడంతో నైజీరియాలో పరిస్థితులు క్షీణించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -