Tuesday, November 4, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం..ఎగిసి పడుతున్న మంటలు

రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం..ఎగిసి పడుతున్న మంటలు

- Advertisement -

పటాన్‌ చెరులో మూతపడ్డ రూప కెమికల్స్‌ పరిశ్రమలో ఘటన
అదుపులోకి రాని మంటలు
ఘాటు వాసనలతో ఉక్కిరి బిక్కిరైన కాలనీ వాసులు
ఏడు పైరింజన్లతో మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది : పరిశ్రమ వద్ద పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ


నవతెలంగాణ-పటాన్‌చెరు
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పారిశ్రామిక వాడలోని ఓ మూతపడ్డ పరిశ్రమలో నిల్వ ఉంచిన డ్రమ్ములు బ్లాస్ట్‌ అయ్యి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో పటాన్‌చెరు పట్టణ శివారులో కొంతకాలంగా మూతబడిన రసాయనిక పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడ్డాయి. దాంతో చుట్టుపక్కల పరిశ్రమలతో పాటు పక్కనే ఉన్న కాలనీవాసులు భయాందోళనలకు గురయ్యారు. కిలోమీటర్ల మేర పొగతో కమ్ముకుపోయి రసాయనాల ఘాటు వాసనలతో పక్కనే ఉన్న సీతారామపురం, గౌతమ్‌ నగర్‌ కాలనీవాసులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

విషయం తెలుసుకున్న పటాన్‌ చెరు ఫైర్‌ స్టేషన్‌ సిబ్బంది ఏడు పైరింజన్లతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పటాన్‌చెరు డీఎస్పీ ప్రభాకర్‌ పర్యవేక్షణలో సీఐ వినాయక్‌ రెడ్డి డివిజన్‌ పరిధిలోని సీఐలు సిబ్బంది పరిశ్రమ వద్దకు చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నంలో నిమగమయ్యారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ పరితోష్‌ పంకజ్‌ పరిశ్రమ వద్దకు చేరుకొని పర్యవేక్షణ చేస్తున్నారు. నిలువ ఉంచిన డ్రమ్ముల్లో నుంచి మంటలు అదుపులోకి రాకపోవడంతో ఫైర్‌ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -