ఐద్వా మహారాష్ట్ర మహాసభలో చిందేసిన భహోతి
ముంబయి : అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) మహారాష్ట్ర రాష్ట్ర మహాసభలో 90 సంవత్సరాల వయస్సున్న బామ్మ ఆడిపాడి అందరినీ ఆకట్టుకుంది. దహను నుంచి మహాసభకు విచ్చేసిన భహోతి (90) ఉత్సాహాన్ని చూసి ఈ సభకు ముఖ్య అతిథిగా వెళ్లిన సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు మరియం ధావలే సైతం ఆమెతో పదం కలిపారు. చిందులేశారు. భహోతి పోరాట ధీర. చారిత్రాత్మక కిసాన్ లాంగ్‌మార్చ్‌లో సైతం ఆమె పాల్గొన్నారు. పాదరక్షలు కూడా వేసుకోకుండా పాదాలు పగిలి రక్తమోడుతున్నా..నాటి లాంగ్‌మార్చ్‌లో 200 కిలోమీటర్లు నడిచారు. ఐద్వా రాష్ట్ర మహాసభ సందర్భంగా పాల్‌గఢ్ జిల్లాలోని దహనులో శనివారం నిర్వహించిన బహిరంగసభకు 30 వేల మంది పైగా మహిళలు హాజరయ్యారు. ఈ సభకు గిరిజనులు, అణగారిన తరగతులకు చెందినవారు అత్యధికంగా తరలివచ్చారు. నసీమా షేక్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఐద్వా అధ్యక్షులు పికె శ్రీమతి టీచర్, ప్రధానకార్యదర్శి మరియం ధావలే, ఆహ్వాన కమిటీ ఛైర్‌పర్సన్, ఎమ్మెల్యే వినోద్ నికోలే పాల్గొన్నారు.
90వ పడిలోనూ ఆటాపాటా
- Advertisement -
- Advertisement -



