నవతెలంగాణ మంచిర్యాల : ఆడుకుంటున్న సమయం లో కాలు జారీ బాలుడు ఐదు అంతస్థుల భవనం పై నుండి క్రింద పడి దుర్మరణం చెందాడు.మంచిర్యాల లో జరిగిన ఈ ఘటన తో బాలుడి కుటుంబం లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నిర్మల్ జిల్లా ఖానాపూర్ కు చెందిన బాలసంకుల రాజా శేఖర్, శృతి దంపతులకు కూతురు సహస్ర, కొడుకు సహార్శ్ (10). కుటుంబ సభ్యలతో కలిసి నిర్మల్ లో నివాసం ఉంటూ ఖానాపూర్ తర్లపాడు లో ప్రభుత్వ ఉపధ్యాయుడు గా విధులు నిర్వర్తిస్తున్నాడు రాజ శేఖర్. అక్టోబర్ 31 నా శృతి సోదరుడు ( సహార్శ్ మేనమామ ) వివాహం మంచిర్యాలలో ఉండగా శృతి తన భర్త, పిల్లలతో కలిసి మంచిర్యాల లోని గౌతమి నగర్ లో గల అవినాష్ అపార్ట్మెంట్ లో ఉండే తల్లి గారి ఇంటికి వస్తారు..పెళ్లి అనంతరం సోమవారం జరిగిన కార్యక్రమం లో భాగంగా భోజనాలు చేసిన పిల్లలు అందరూ కలిసి అపార్ట్మెంట్ పై అంతస్తూ కు వెళ్లి ఆడుకునే క్రమంలో ప్లాస్టిక్ రేకు పై సహార్శ్ కాలు వేయడంతో జారీ 5వ అంతస్తూపై నుండి క్రింద పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ప్రయివేట్ హాస్పిటల్ కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని, పోస్టు మార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ హాస్పిటల్ కు బాలుడి మృతదేహన్ని తరలించినట్లు తెలిపారు. మృతుడి తండ్రి రాజ శేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పట్టణ సీఐ ప్రమోద్ రావు తెలిపారు.
భవనంపై నుంచి పడి బాలుడి మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



