రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలు. ఈ సినిమా ఈ నెల 7న హిందీతో పాటు తెలుగులో, ఈ నెల 14న తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్‌కు రాబోతోంది. ఈ సందర్భంగా సోమవారం హీరో దీక్షిత్ శెట్టి మీడియాతో పలు చిత్ర విశేషాలను షేర్ చేసుకున్నారు. ‘దసరా’ మూవీకి చేసిన ఇంటర్వ్యూల్లో నన్ను చూసి రాహుల్ ఈ సినిమాలోని విక్రమ్ క్యారెక్టర్‌కు నేను బాగుంటానని ఫిక్స్ అయ్యారు. ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి స్క్రిప్ట్స్ చాలా అరుదుగా వస్తుంటాయి. అందుకే ఈ సినిమాను తప్పకుండా చేయాలని డిసైడ్ అయ్యా. ఈ సినిమాలో విక్రమ్ క్యారెక్టర్ ఎలా ఉండాలో దర్శకుడు రాహుల్‌కు పూర్తి క్లారిటీ ఉంది.
ఆయనకు ఉన్న క్లారిటీ వల్ల చాలా లేయర్స్ ఉన్న విక్రమ్ క్యారెక్టర్‌ను పర్‌ఫార్మ్ చేయడం నాకు ఈజీ అయ్యింది. ప్రేమ కథని ఈ సినిమా మరో కోణంలో చూపిస్తుంది. మనం వినోదం కోసం సినిమాలు చూస్తుంటాం. కానీ కొన్ని సినిమాల్లోని ఫీల్ మనతో పాటే క్యారీ అవుతుంది. అలాంటి సినిమా ఇది. ఈ సినిమాలోని పాత్రలు, సందర్భాలు మనం మన లైఫ్‌లో రిలేట్ చేసుకునేలా ఉంటాయి. రష్మిక ఈ సినిమా కోసం ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఇలాంటి సినిమా కొన్నేళ్ల కిందట తాను చూసి ఉంటే, తన జీవితం పట్ల తన దక్పథం మరోలా ఉండేది అని చెప్పారు. 18 నుంచి 25 ఏళ్ల యూత్ ఈ సినిమా చూస్తే తమ లైఫ్‌లో కొన్ని విషయాలు నేర్చుకుంటారు. రష్మిక పర్‌ఫార్మెన్స్ చూశాక ఈ సినిమాకు మరో నాయిక న్యాయం చేయలేదేమో అనిపించింది. అంత బాగా పర్‌ఫార్మ్ చేసింది. మూవీ చూస్తున్నంత సేపు మీకు రష్మిక కనిపించదు, భూమా పాత్రనే కనిపిస్తుంది.
రాహుల్ మంచి రైటర్, డైరెక్టర్. అంతకంటే మంచి మనిషి. స్క్రిప్ట్, క్యారెక్టర్స్ విషయంలో ఆయనకు చాలా క్లారిటీ ఉంది. ఈ సినిమా చిత్రీకరణ టైమ్‌లో అరవింద్ రషెస్ చూసి పిలిచారు. నేను సరిగ్గా నటించడం లేదేమో, ఏమంటారో అని వెళ్లా. ఆయన అప్రిషియేట్ చేసి, నెక్ట్స్ మూవీకి అడ్వాన్స్ ఇచ్చారు. సుదీర్ఘ అనుభవం ఉన్న అలాంటి గొప్ప ప్రొడ్యూసర్ నుంచి ప్రశంసలు రావడం, మరో సినిమాకు అడ్వాన్స్ ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది. నేను కన్నడలో చేసిన ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’ తెలుగులో ఈ నెల 21న విడుదల చేయబోతున్నాం. తెలుగులో ‘షబానా’ అనే సినిమా చేస్తున్నా. ఇది కాకుండా ‘కేజేక్యూ’ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. టైటిల్ ఖరారు కాని ఇంకో ప్రాజెక్ట్‌లోనూ నటిస్తున్నా. కన్నడలో శివ రాజ్‌కుమార్‌తో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నా, మలయాళంలో చేస్తున్న ‘ఏంజెల్ నెం.16 ‘రిలీజ్ కు రెడీ అవుతోంది. తమిళంలో ఒక మూవీ చిత్రీకరణ దశలో ఉంది.
సరికొత్త ప్రేమకథా చిత్రం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



