– థాయ్‌లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ ప్రి క్వార్టర్‌ఫైనల్లోకి ఆకర్షీ కశ్యప్, ఉన్నతి హుడా ప్రవేశించారు. బుధవారం జరిగిన తొలిరౌండ్ పోటీలో ఆకర్షీ కశ్యప్ మూడుసెట్ల హోరాహోరీ పోరులో 21-16, 20-22, 22-20తో ఎగ్జిన్ సుగియామా(జపాన్)పై విజయం సాధించింది. 17ఏళ్ల ఆకర్షీ తొలి గేమ్‌ను సునాయాసంగా చేజక్కించుకున్నా.. రెండో గేమ్‌ను ముగించడానికి చెమటోడ్చాల్సి వచ్చింది. ఇక ఉన్నతి హుడా 21-14, 18-21, 23-21తో నితిత్‌కరారు(ఇండోనేషియా)పై చెమటోడ్చి నెగ్గింది. మరో పోటీలో సంతోష్ రామ్‌రాజ్ 19-21, 7-21తో 8వ ర్యాంక్ క్రీడాకారిణి, సింగపూర్‌కు చెందిన యో-జి-మిన్ చేతిలో ఓటమిపాలైంది. ఇక మాల్విక బన్సోద్ 21-12, 13-21, 21-17తో సింగపూర్‌కు చెందిన నిషిహాన్‌పై పోరాడి గెలుపొందగా.. అనుపమ ఉపాధ్యాయ 11-21, 9-21తో 7వ ర్యాంకర్ థారులాండ్‌కు చెందిన ఇంటనాన్ చేతిలో ఓటమిపాలైంది. ఇక పురుషుల సింగిల్స్‌లో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. ప్రధాన టోర్నీకి అర్హత సాదించిన తరుణ్ మన్నేపల్లి, స్టార్ షట్లర్లు లక్ష్యసేన్, ప్రియాన్షు రాజ్‌వత్ తొలిరౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు.
ప్రి క్వార్టర్స్‌కు ఆకర్షీ, ఉన్నతి
- Advertisement -
- Advertisement -