Tuesday, November 4, 2025
E-PAPER
Homeజాతీయంఆభరణాల ఎగుమతులకు ట్రంప్‌ దెబ్బ

ఆభరణాల ఎగుమతులకు ట్రంప్‌ దెబ్బ

- Advertisement -

70 శాతానికిపైగా పతనం
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల భారత్‌పై విధించిన అధిక టారిఫ్‌లు దేశ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అభరణాలు, రత్నాల ఎగుమతులు భారీగా దెబ్బతిన్నాయి. భారత అభరణాలు, రత్నాలపై ట్రంప్‌ విధించిన 50 శాతం టారిఫ్‌లతో గడిచిన సెప్టెంబర్‌లో విలువైన రత్నాలు, ముత్యాలు, విలువైన రంగురాళ్ల ఎగుమతులు 76.7 శాతం క్షీణించాయి. బంగారం, ఇతర విలువైన లోహాల ఆభరణాల ఎగుమతులు 71.1 శాతం పడిపోయాయి. ఈ ఏడాది మే-సెప్టెంబర్‌ కాలంలో 58 శాతం క్షీణించి 202..8 మిలియన్లకు పతనమయ్యాయి.

గతేడాది ఇదే కాలంలో వీటి ఎగుమతులు 500.2 మిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ట్రంప్‌ అధిక సుంకాల కారణంగా యుఎస్‌ కొనుగోలుదారులు ఇప్పుడు థారులాండ్‌, వియత్నాం, చైనా వంటి ఇతర దేశాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ దేశాలు 20-30 శాతం మధ్య తక్కువ సుంకాలను కలిగి ఉన్నాయి. దీంతో భారత ఉత్పత్తులు అమెరికాలో పోటీ పడలేకపోతున్నాయి. భారత్‌లో రత్నాలు, ఆభరణాల రంగం లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. వీటి ఎగుమతుల క్షీణతతో ఈ రంగంలోని ఉద్యోగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో రత్నాలు, అభరణాల రంగాలను ఆదుకోవడానికి తమకు వడ్డీ రాయితీలు, అత్యవసర రుణాలను ఇవ్వాలని జెమ్‌ అండ్‌ జ్యువెలరీ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (జిజెఇపిసి) కేంద్రాన్ని కోరుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -