కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
జూబ్లీహిల్స్‌లో మా అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించలేదని కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి అన్నారు. దేశంలోని 7 ఉప ఎన్నికలకు ఒకేసారి అభ్యర్థిని ప్రకటించామన్నారు. రేవంత్ కోసమో ఇంకెవరి కోసమో ముందుగా ప్రకటించలేమని తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని బీజేపీ ఆఫీసులో మీడియాతో చిట్‌చాట్ చేశారు. జూబ్లీహిల్స్ లో త్రిముఖ పోరు ఉంటుందని మంత్రి అన్నారు. సర్వేలు బెడ్రూంలో ఉండి చేశారో.. ఎక్కడ ఉండి చేశారో అనేది ఎవరికీ తెలియదన్నారు. రాజకీయ పార్టీల్లో ఎవరికి వారు గెలవాలని కోరుకోవడంలో తప్పులేదని చెప్పారు. సన్నబియ్యంలో కేంద్రం ఇచ్చేవి రూ.42 ఉన్నాయనీ, రాష్ట్రానివి రూ.13 మాత్రమేనని గుర్తు చేశార. మేము గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు కూడా సర్వే చేయలేదనీ, ఈ ఉప ఎన్నికకు కూడా చేయబోమన్నారు. అజారుద్దీన్‌తో ఓట్లు వస్తాయని భావిస్తే టికెట్ ఆయనకే ఇచ్చేవారు కదా అని చెప్పారు. ముస్లింలపై ప్రేమతో ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదనీ, కేవలం ఒక సామాజిక వర్గం ఓట్ల కోసమే ఇచ్చారని విమర్శించారు. ఆయనపై కేసులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని చెప్పారు. మెట్రో ఫేస్ 2కు సంబంధించిన డీపీఆర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కేంద్రానికి ఇవ్వలేదన్నారు.
జూబ్లీహిల్స్‌లో మా అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించలేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES

                                    

