ఎస్సీలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?
జూబ్లీహిల్స్‌లో ఓట్లడిగే హక్కు ఆ పార్టీకి లేదు
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వం దళితులను మోసం చేస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో దళితులకు ఇచ్చిన హామీల అమలు ఏమైందని ప్రశ్నించారు. వారికి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓట్లడిగే హక్కు కాంగ్రెస్ లేదన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దళితనుల అవమానస్తున్నదని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్‌ను విడుదల చేశారని గుర్తు చేశారు. దళితులను కాంగ్రెస్ ఓటుబ్యాంకుగానే వాడుకుంటున్నది తప్ప వారికిచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. ఈ హామీలపై సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఒక్కసారైనా సమీక్ష చేశారా?అని ప్రశ్నించారు. దళితబంధు రూ.12 లక్షలు ఇస్తామన్నారనీ, ఇందిరమ్మ ఇండ్లకు రూ.ఆరు లక్షలు చెల్లిస్తామన్నారని గుర్తు చేశారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను దారిమళ్లిస్తున్నారని విమర్శించారు. అసైన్డ్ భూములకు హక్కులిస్తామంటూ హామీ ఇచ్చినా అమలు చేయలేదని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలను నిలదీయాలని అన్నారు. రాష్ట్రంలో దళిత ఉద్యమాన్ని తెస్తామన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
దళితులను మోసం చేసిన కాంగ్రెస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES

                                    

