Tuesday, November 4, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజల ఆహారంలో చేపలు భాగం కావాలి

ప్రజల ఆహారంలో చేపలు భాగం కావాలి

- Advertisement -

– ఆ దిశగా ప్రచార ప్రణాళికలు రూపొందించండి
– నవంబర్‌ చివరికల్లా చేపపిల్లలు చెరువులకు చేరాలి
– మత్స్యశాఖకు రూ.123 కోట్ల బడ్జెట్‌ : మంత్రి వాకిటి శ్రీహరి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

మాంసం భుజించడంలో మొదటి స్థానంలో ఉన్న తెలంగాణ చేపలను భుజించడంలో వెనుకబడి ఉందనీ, చేపల ఆహారం తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యపరమైన లాభాలపై విస్తృత ప్రచార ప్రణాళికలు రూపొందించాలని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో చేపపిల్లల పంపిణీపై 32 జిల్లాల కలెక్టర్లు, మత్స్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ నవంబర్‌ చివరికల్లా చేపపిల్లల పంపిణీ పూర్తి చేయాలనీ, దానికి సంబంధించి ప్రతి వారం నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. గత ప్రభుత్వ హయంలో చేప పిల్లల పంపిణీలో అక్రమాలు జరిగాయని విమర్శించారు. చేపపిల్లల పంపిణీ పారదర్శకంగా చేపట్టేందుకు ప్రతి చెరువు వద్ద పూర్తి వివరాలు తెలిపేలా సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. చేప పిల్లల పంపిణీ ప్రక్రియను ప్రభుత్వ నియమ నిబంధనలకనుగుణంగా టి మత్స్య యాప్లో అప్లోడ్‌ చేయాలన్నారు. చేపల ఉత్పత్తి, మార్కెటింగ్‌ సదుపాలు పెంచడమే లక్ష్యంగా ముందుకెళ్లాలన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఫిష్‌ రిటైల్‌ అవుట్‌ లెట్‌ మార్కెట్‌ కోసం స్థలాలను కేటాయంచాలని కలెక్టర్లను ఆదేశించారు. మధ్యాహ్న భోజనం పథకంలో చేపల వంటకాన్ని అమలు చేయడంపై పరిశీలిస్తున్నామని చెప్పారు. సమావేశంలో మత్స్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్‌, ఫిషరీస్‌ డైరెక్టర్‌ నిఖిల, అడిషనల్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -