Tuesday, November 4, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంచేవెళ్ల రోడ్డు ప్రమాదంపై కేసీఆర్‌, కేటీఆర్‌ దిగ్భ్రాంతి

చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై కేసీఆర్‌, కేటీఆర్‌ దిగ్భ్రాంతి

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్‌ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు వారు సోమవారం వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. రంగారెడ్డి జిల్లా తాండూర్‌ బస్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, టిప్పర్‌ ఢకొీన్న దుర్ఘటనలో 21 మంది ప్రయాణికులు మరణించడం బాధాకరమని తెలిపారు. మరణించిన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడంతోపాటు గాయపడిన ప్రయాణికులకు మెరుగైన వైద్య సదుపాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -