Tuesday, November 4, 2025
E-PAPER
Homeబీజినెస్అమెరికాకు తగ్గిన భారత ఎగుమతులు

అమెరికాకు తగ్గిన భారత ఎగుమతులు

- Advertisement -

– ఐదు నెలల్లో 37 శాతం పతనం
– ట్రంప్‌ టారిఫ్‌ల ప్రభావం
న్యూఢిల్లీ :
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల భారత్‌పై విధించిన అధిక టారిఫ్‌లు దేశ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ ఏడాది మే నుంచి సెప్టెంబర్‌లో యుఎస్‌కు ఎగుమతులు ఏకంగా 37.5 శాతం పతనమయ్యాయని గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇన్షియేటివ్‌ (జీటీఆర్‌ఐ) ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. ఈ ఐదు నెలల కాలంలో యుఎస్‌కు 5.5 బిలియన్‌ డాలర్ల విలువ చేసే సరకుల సరఫరా మాత్రమే జరిగింది. గతేడాది ఇదే కాలంలో ఏకంగా 8.8 బిలియన్ల ఎగుమతులు నమోదయ్యాయి. ఏప్రిల్‌ 2 నుంచి ప్రారంభమైన అదనపు సుంకాలు ఆగస్టు చివరి నాటికి 50 శాతానికి పెంచుతూ ట్రంప్‌ నిర్ణయాలు చేశారు. అధిక టారిఫ్‌లు భారత పరిశ్రమలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు, ఫార్మాస్యూటికల్స్‌, రత్నాలు అండ్‌ ఆభరణాలు, వస్త్రాలు, సోలార్‌ ప్యానెల్‌లు, రసాయనాలు, సముద్ర ఉత్పత్తులు వంటి కీలక రంగాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి.

వీటిపైనే ఎక్కువ ప్రభావం..
స్మార్ట్‌ఫోన్‌ ఎగుమతులు 58 శాతం పతనమై 884.6 మిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే నాలుగు నెలల్లో 2.29 బిలియన్ల ఎగుమతులు జరిగాయి. ఇదే సమయంలో రత్నాలు అభరణాల ఎగుమతులు 500.2 మిలియన్‌ డాలర్లుగా ఉండగా.. గడిచిన మే-సెప్టెంబర్‌ కాలంలో 58 శాతం క్షీణించి 202..8 మిలియన్లకు పతనమయ్యాయి. సోలార్‌ ప్యానెల్‌ ఎగుమతులు 60.8 శాతం పతనంతో 79.4 మిలియన్లకు తగ్గాయి. ఔషధ ఉత్పత్తుల ఎగుమతులు 15.7 శాతం, వస్త్రాలు, రసాయనాలు, వ్యవసాయ ఉత్పత్తులు వంటి రంగాలు 33 శాతం పతనాన్ని చవి చూశాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -