Wednesday, November 5, 2025
E-PAPER
Homeజిల్లాలుపర్వతాపూర్ మైసమ్మ దేవతకు రెండు తులాల బంగారం

పర్వతాపూర్ మైసమ్మ దేవతకు రెండు తులాల బంగారం

- Advertisement -

అమ్మవారికి మొక్కుబడి చెల్లించిన దంపతులు 
నవతెలంగాణ – నవాబు పేట
మండల పరిధిలోని కాకర్లపహడ్ గ్రామ సమీపంలో ఉన్న పర్వతాపూర్ మైసమ్మ దేవతకు రెండు తులాల బంగారాన్ని మహమ్మదాబాద్ కు చెందిన దంపతులు అరుణ-హరినాథ్ లు దేవాలయ చైర్మన్ జగన్ మోహన్ రెడ్డికి అందజేసి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అమ్మవారి ఆశిస్సులు ఎల్లప్పుడూ తమకు ఉండాలని అన్నారు. గతంలో అమ్మవారిని దర్శించుకుని మేము ఓ మొక్కు మొక్కుకున్నామని, నేడు ఆ తల్లి తమ కోరికలను తీర్చిందని తెలిపారు. అందుకు మేము మా మొక్కును ఆ తల్లికి చెల్లించామని తెలిపారు. పర్వతాపూర్ మైసమ్మ తల్లి మహిమగల మైసమ్మ దేవత అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి నర్సింహులు, సిబ్బంది గోపాల్, మల్లేష్, అనసూయమ్మ, రమేష్, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -