పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి..
ఎస్ఎఫ్ఐ భూపాలపల్లి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొడ్డు స్మరణ కుమ్మరి రాజ్ కుమార్
నవతెలంగాణ – కాటారం
మంథని నియోజకవర్గం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొడ్డు స్మరణ కుమ్మరి రాజ్ కుమార్ మాట్లాడుతూ… రాష్ట్రంలో గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని ఈ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఏదైతే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 15% పైన నిధులు కేటాయిస్తామని మాటిచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా స్కాలర్షిప్స్ పై చదువుకునే విద్యార్థులకు ఇచ్చినటువంటి మాట తప్పి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ విద్యార్థులను మోసం చేసిందని అన్నారు. తక్షణమే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కాటారం డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు బొడ్డు సాగర్ తరుణ్., మహ ముత్తారం మండల అధ్యక్షులు పంకిడి శ్రావణ్, తదితరులు పాల్గొన్నారు.
మంత్రి శ్రీధర్ బాబు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన ఎస్ఎఫ్ఐ
- Advertisement -
- Advertisement -



