– కేంద్రమంత్రి వర్గం ఆమోదం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఉత్తరప్రదేశ్‌లోని జెవార్‌లో రూ.3,706 కోట్లతో సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటుకు కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపింది. బుధవారం నాడిక్కడ ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్రమంత్రి వర్గ సమావేశం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ హెచ్‌సీఎల్-ఫాక్స్‌కాన్ సెమీకండక్టర్ ప్లాంట్ మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఆటోమొబైల్స్, ఇతర పరికరాల కోసం డిస్ప్లే డ్రైవర్ చిప్‌లను తయారు చేస్తుందని అన్నారు. ఇప్పటికే ఐదు సెమీకండక్టర్ యూనిట్లు నిర్మాణంలో అధునాతన దశలో ఉన్నాయని పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని జెవార్‌లో ఏర్పాటు చేసే ప్లాంట్ ఆరో సెమీకండక్టర్ యూనిట్‌గా నిలుస్తుందని అన్నారు. దేశాన్ని ఇది ”వ్యూహాత్మకంగా కీలకమైన సెమీకండక్టర్ పరిశ్రమను అభివృద్ధి చేసే ప్రయాణంలో ముందుకు తీసుకెళ్తుంది” అని అన్నారు. ఈ యూనిట్ నెలకు 20,000 వేఫర్‌లను ప్రాసెస్ చేస్తుందని, దాదాపు 2,000 ఉద్యోగాలను సృష్టిస్తుందని తెలిపారు. ”దేశవ్యాప్తంగా సెమీకండక్టర్ పరిశ్రమ ఇప్పుడు రూపుదిద్దుకుంటోంది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ప్రపంచ స్థాయి డిజైన్ సౌకర్యాలు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వాలు డిజైన్ సంస్థలను అనుసరిస్తున్నాయి” అని అన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో రూ.3,706 కోట్లతో సెమీకండక్టర్
- Advertisement -
- Advertisement -