Wednesday, November 5, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఆదిలాబాద్ లో "పోలీస్ అక్క" కార్యక్రమానికి ఎస్పీ శ్రీకారం

ఆదిలాబాద్ లో “పోలీస్ అక్క” కార్యక్రమానికి ఎస్పీ శ్రీకారం

- Advertisement -

లాంఛనంగా ప్రారంభించిన ఎస్పీ అఖిల్ మహాజన్
షీ టీంతో సంయుక్తంగా పోలీసు అక్క కార్యక్రమం
నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్

పాఠశాల విద్యార్థులకు జిల్లా పోలీస్ వ్యవస్థ మరింత చెరువు కావడానికి జిల్లాలో మొట్టమొదటిసారిగా “పోలీస్ అక్క” అనే కార్యక్రమానికి ఎస్పీ అఖిల్ మహాజన్ శ్రీకారం చుట్టారు. ఈ మహోత్తర కార్యక్రమాన్ని మంగళవారం పట్టణంలోని సాంఘిక సంక్షేమ కళాశాల, పాఠశాలలో 250 మంది విద్యార్థినిల సమక్షంలో ఎస్పీ లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా ఎస్పీకి విద్యార్థినులు ఘనంగా స్వాగతం పలికారు. ఎస్పీ జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీస్ అక్క పేరుతో ప్రతి పోలీస్ స్టేషన్ కు చెందిన ఒక మహిళ పోలీసు కానిస్టేబుల్ తో పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు, మహిళల పట్ల విద్యార్థినుల పట్ల జరిగే నేరాలపై అవగాహనను కల్పించనున్నారు. పాఠశాల బాలురకు, బాలికల పట్ల ప్రవర్తించవలసిన తీరును వివరించనన్నారు. జిల్లాలోని ప్రతి ఒక్క పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు పోలీస్ స్టేషన్ కు సంబంధించినటువంటి మహిళా పోలీసు వారానికి రెండు,మూడు రోజులు పలు పాఠశాలలను సందర్శించి వారితో సమావేశం నిర్వహించి వారికి అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు.

అదేవిధంగా గ్రామాలను సైతం సందర్శిస్తూ మహిళలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ముఖ్యంగా జిల్లాలో మొట్టమొదటిసారిగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం విద్యార్థుల తమ జీవితంలో వారి పట్ల జరిగిన అన్యాయాలను అఘాయిత్యాలను ధైర్యంగా జిల్లా పోలీసుల కు సమాచారం అందించాలని వారిలో ధైర్యసాహసాలను పెంపొందించడానికి తమ వంతు ప్రయత్నంగా ఈ కార్యక్రమం కొనసాగనుందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులకు జరిగిన అన్యాయాలు మరుగున పడకుండా ఇతరులకు అదే రీతిలో అన్యాయాలు జరగకుండా అడ్డుకోవడానికి జిల్లా పోలీసు యంత్రాంగం పోలీసు అక్క పేరుతో విద్యార్థులకు దగ్గరై ఈవ్ టీజింగ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ లపై, రోడ్లపై ఆకతాయిల వేధింపులపై, బాల్యవివాహాలపై, సోషల్ మీడియా వేధింపులపై, ఫేక్ సోషల్ మీడియా ద్వారా విద్యార్థులకు ఇబ్బందులు కలిగించడం, ప్రేమ పేరుతో వేధింపులు, ఫోటోలను వీడియోలను తీసుకొని వాటి ద్వారా బ్లాక్మెయిలింగ్కు పాల్పడడం లాంటి వాటిని ధైర్యంగా జిల్లా పోలీసుల దృష్టికి తీసుకురావాలని వారి పేర్లను బయటకు రాకుండా సరైన న్యాయం చేసే దిశగా జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు.

అదేవిధంగా విద్యార్థినిలకు జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించే దిశగా చేయవలసిన కృషి పట్ల అదేవిధంగా విజయానికి కావలసినటువంటి పట్టదల, క్రమశిక్షణ సమయపాలన ఇలాంటి అంశాలపై వివరణ, ముఖ్యంగా మహిళలు తమ రక్షణకై తమ భద్రతకై తీసుకోవాల్సిన అంశాలు వివరించనన్నట్లు తెలిపారు. విద్యార్థులు ఎలాంటి అత్యవసర సమయంలోనైనా జిల్లా షీ టీం బృందాలను లేదా డయల్ 100 ద్వారా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించవచ్చని తెలిపారు. షీ టీం కు సంప్రదించాలంటే 8712659953 నెంబర్ కు సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు. పోలీస్ స్టేషన్ కు రాకుండా కేవలం సమాచారం ద్వారా తమ సమస్యలను పరిష్కరించే దిశగా పోలీసులు సరికొత్త నూతన విధానాలను అవలంబిస్తున్నట్లు మహిళలకు విద్యార్థులకు పూర్తి సహాయం అందిస్తూ జిల్లా పోలీసు యంత్రాంగం అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి ఉట్నూర్ కాజల్ సింగ్, డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్ లలిత కుమారి, పట్టణ సీఐలు కర్ర స్వామి, బీ.సునీల్ కుమార్, కే.ప్రభాకర్, కే.నాగరాజు, ప్రణయ్ కుమార్, ప్రేమ్ కుమార్, అంజమ్మ, పోలీసు అక్క కార్యక్రమం ఉమెన్ కానిస్టేబుల్స్, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -