Wednesday, November 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలి

ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలి

- Advertisement -

• అధికార యంత్రంగం సమన్వయంతో పనిచేయాలి
• జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్
నవతెలంగాణ -పెద్దవంగర
ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం జిల్లా సహకార అధికారి వెంకటేశ్వర్లు, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ క్రిష్ణవేణి లతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా వరి కోతలు ముందుగానే ప్రారంభించిన నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం సేకరణ కొనుగోళ్ల కేంద్రాల నిర్వహణ, రవాణా, కేంద్రాలలో మౌలిక వసతుల ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా కొనుగోలు చేసే ధాన్యాన్ని రవాణా చేసే విషయంలో రైస్ మిల్లర్లు, కాంట్రాక్టర్స్, హమాలీలు, రైతులు కేంద్రాల నిర్వహణ సిబ్బంది అందరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు.

ఇప్పటికే కొనుగోలు చేసిన ధాన్యం రవాణా ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకొని ధాన్యాన్ని పరిరక్షించాలని పేర్కొన్నారు. అవసరమైన గన్నీ సంచులు, టార్పాలిన్లు, వెయింగ్ యంత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతుల సౌలభ్యం కోసం హమాలీల కోసం టెంట్లు వేయించాలని, త్రాగునీటి వసతి కల్పించాలని, కుర్చీలు ఉంచాలని సూచించారు. రైతులకు 48 గంటల్లో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ లు మహేందర్, శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి గుగులోత్ స్వామి నాయక్, ఏపీఎం ఎండీ పాషా, పీఏసీఎస్ సీఈవో మురళి, సీసీ లు, రైస్ మిల్లర్లు, ఐకేపీ, పీఏసీఎస్ సిబ్బంది, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మహిళా సంఘాల ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -