- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి
యూపీ నుండి భువనగిరికి వాహనంలో వస్తున్న కాంగ్రెస్ పట్టణ మాజీ అధ్యక్షులు బిస్కుంట్ల సత్యనారాయణకు మార్గమధ్యంలో మంగళవారం ప్రమాదం జరిగి తలకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతనిని వైద్యశాలకు తరలించారు. ఈ సంఘటన తెలిసిన వెంటనే పలువురు కాంగ్రెస్ నాయకులు, ముదిరాజ్ సంఘం నాయకులు సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితులను, ప్రమాదానికి కారణమైన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.
- Advertisement -



