Wednesday, November 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నకిలీ విత్తనాలపై ఏడిఏకు వినతి

నకిలీ విత్తనాలపై ఏడిఏకు వినతి

- Advertisement -

పేరు లేని కంపెనీ విత్తనాలు కొనొద్దు: రైతు రక్షణ సమితి హెచ్చరిక
నవతెలంగాణ -పరకాల 

జిల్లాలో రైతులు నకిలీ విత్తనాలకు బలికాకుండా జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వరికెల కిషన్ రావు పిలుపునిచ్చారు. పరకాల వ్యవసాయ అభివృద్ధి అధికారి (ఏడీఏ) కార్యాలయానికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కొన్ని పేరు లేని కంపెనీలకు చెందిన దళారీలు గ్రామాలకు చేరుకుని అధిక దిగుబడులు వస్తాయని చెబుతూ రైతులను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కంపెనీలకు ప్రభుత్వ అనుమతి, రిజిస్ట్రేషన్ లేకుండానే రైతులకు విత్తనాలు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

“ఇలాంటి విత్తనాలు వాడితే రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలు చవిచూడవలసి వస్తుంది. కాబట్టి రైతులు ప్రభుత్వ గుర్తింపు ఉన్న కంపెనీల విత్తనాలు మాత్రమే కొనుగోలు చేయాలి. అవసరమైతే ముందస్తు ఒప్పందాల ద్వారా పంట సాగు చేయాలి,” అని కిషన్ రావు సూచించారు. తుఫాను కారణంగా ఇప్పటికే పంటలు నష్టపోయిన రైతులు మళ్లీ మొక్కజొన్న పంట సాగు చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో, నకిలీ విత్తనాలు అందితే పరిస్థితి మరింత దయనీయమవుతుందని ఆయన హెచ్చరించారు. జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతి మండలంలో అవగాహన సదస్సులు నిర్వహించి రైతులకు పూర్తి సమాచారం అందించాలని సమితి అధికారులు ఏడీఏను కోరారు. ఇక ఈ కార్యక్రమంలో నాగూర్ల రాజీవ్ మోడే మోహన్ రావు బాసిడి బాపూరావు జుంక జువ్వ రవి రైతు రక్షణ సమితి సంఘం రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -