నవతెలంగాణ – రామన్నపేట
రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన చల్లమల్ల శ్రీనివాస్ ఇటీవల ఆకస్మికంగా మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబం రోడ్డున పడింది. దిక్కు తోచని స్థితిలో ఉన్న మీ కుటుంబాన్ని ఆదుకోవాలని ఉద్దేశంతో గ్రామానికి చెందిన ఆయన స్నేహితులు, గ్రామ పెద్దలు చేయి చేయి కలిపి ఆ కుటుంబానికి అండగా నిలుద్దామని నిర్ణయించుకొని గ్రామంలోని వాట్సప్ గ్రూపుల ద్వారా కొంగరి బాలరాజు అకౌంట్ నెంబర్ ఇచ్చి సహాయం చేయాలని కోరారు. స్పందించిన పలువురు తమకు తోచిన ఆర్థిక సహాయాన్ని అకౌంట్ కు జమ చేశారు. ఆ అకౌంటులో జమ అయిన రూ.94,317 మొత్తాన్ని మంగళవారం చలమల్ల శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు గ్రామ పెద్దలు అందరు కలిసి అందజేశారు.
నిరంతరం అండగా ఉంటామని ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు భరోసాని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ అప్పం లక్ష్మీనర్సు, మాజీ ఎంపిటిసి బడుగు రమేష్, పద్మశాలి సంఘం అధ్యక్షులు జెల్ల శ్రీనివాస్, నాయకులు గోశిక చక్రపాణి, సాయిని శేఖర్, పున్న భద్రాచలం, పున్న కనకరత్నం, చిలువేరు వెంకటయ్య, మూడుదుడ్ల రాజు, దొంత యాదగిరి, పున్న యాదగిరి, గంజి రామకృష్ణ, పున్న శివ కుమార్, సింగం ఉపేందర్ తో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.


