– రాయపోల్ ఎస్ ఐ కుంచం మానస
నవతెలంగాణ- రాయపోల్
రాయపోల్ మండల పరిధిలో వివాహ శుభకార్యాలకు ఊరేగింపులకు ఇతర కార్యక్రమాలకు డీజే ఉపయోగిస్తే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని, ప్రజలకు డీజే యజమానులకు ఆపరేటర్లకు తెలియజేయడం జరుగుతుందని రాయపోల్ ఎస్ఐ కుంచం మానస అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిటీ పోలీస్ యాక్ట్ అమరులో ఉన్న సందర్భంగా వివాహ ఊరేగింపులు కానీ పార్టీల సమావేశాలు ఇతర ఎలాంటి కార్యక్రమాల కైనా డీజే ఉపయోగిస్తే తప్పనిసరిగా పోలీస్ స్టేషన్ లో అనుమతి తీసుకోవాలని రాయపోల్ పోలీస్ స్టేషన్ పరిదిలోగల డీజే యజమానులకు, ఆపరేటర్లను తెలపడం జరుగుతుందన్నారు. అలాగే అనుమతి తీసుకున్న సమయం ప్రకారం మాత్రమే డీజే ఉపయోగించాలని సూచించారు. రాత్రి 10:00 గంటల తర్వాత డీజే ఉపయోగించరాదు. అనుమతి లేకుండా డీజే ఉపయోగించిన లేదా ఇచ్చిన సమయం కన్నా ఎక్కువ సమయం డీజే ని ఉపయోగించిన డీజేకి ఉపయోగించే పరికరాలు, వాహనాలను సీజ్ చేసి అట్టి వారి పై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కాబట్టి డీజే యజమానులు మరియు ఆపరేటర్లు పోలీసు శాఖకు సహకరించగలరని అలాగే అనుమతి లేకుండా డీజేలు ఏర్పాటు చేయకూడదన్నారు. కావున ఇట్టి ఆదేశాలను అతిక్రమించిన వారు చట్టరీత్యా చర్యలకు బాధ్యులు అవుతారని తెలియజేశారు.
డీజేలకు తప్పనిసరి అనుమతి తీసుకోవాలి
- Advertisement -
- Advertisement -



