Wednesday, November 5, 2025
E-PAPER
Homeసినిమా'కె-ర్యాంప్‌' విజయం నాకెంతో ప్రత్యేకం

‘కె-ర్యాంప్‌’ విజయం నాకెంతో ప్రత్యేకం

- Advertisement -

హీరో కిరణ్‌ అబ్బవరం
హీరో కిరణ్‌ అబ్బవరం నటించిన ‘కె-ర్యాంప్‌’ మూవీ హౌస్‌ఫుల్‌ షోస్‌తో, పెరుగుతున్న కలెక్షన్స్‌తో బ్లాక్‌బస్టర్‌ విజయం దిశగా పరుగులు తీస్తోంది. ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా థర్డ్‌ వీక్‌ ప్రదర్శితమవుతూ 40 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించి, దీపావళి బాక్సాఫీస్‌ విన్నర్‌గా నిలిచింది. ఈ సినిమాను హాస్య మూవీస్‌, రుద్రాంశ్‌ సెల్యులాయిడ్‌ బ్యానర్‌ల మీద రాజేష్‌ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మించారు. జైన్స్‌ నాని దర్శకత్వం వహించారు. ఈ సినిమా గ్రాండ్‌ సక్సెస్‌ నేపథ్యంలో ‘కె-ర్యాంప్‌’ ర్యాంపేజ్‌ బ్లాక్‌బస్టర్‌ సెలబ్రేషన్స్‌ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, నిర్మాత బండ్ల గణేష్‌ అతిథులుగా హాజరయ్యారు. అతిథుల చేతుల మీదుగా మూవీ టీమ్‌కు జ్ఞాపికలు అందించారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ జైన్స్‌ నాని మాట్లాడుతూ,”కె-ర్యాంప్‌’ అంటే కిరణ్‌ అబ్బవరం ర్యాంప్‌. ఈ సినిమాను థియేటర్స్‌లో చూసి ఈలలు వేసి, ప్రేక్షకులంతా ఎంజారు చేశారు. నాపై నమ్మకంతో ఈ సినిమాను డైరెక్ట్‌ చేసే అవకాశం కల్పించారు కిరణ్‌. ఇది మా టీమ్‌ అందరి విజయం’ అని తెలిపారు.
‘ఇది నా జీవితంలో సంతోషకరమైన రోజు. డిస్ట్రిబ్యూటర్‌గా నా కెరీర్‌ మొదలుపెట్టాను. ఈ రోజు నిర్మాతగా నా డిస్ట్రిబ్యూటర్స్‌కు షీల్డ్స్‌ అందివ్వడం మర్చిపోలేను. గతేడాది ‘క’ సినిమాతో కిరణ్‌ హిట్‌ కొట్టారు. నా డిస్ట్రిబ్యూటర్స్‌ అంతా మంచి థియేటర్స్‌ ఇచ్చి ఈ దీపావళి ‘కె ర్యాంప్‌’ దీపావళి అని ప్రూవ్‌ చేశారు’ అని ప్రొడ్యూసర్‌ రాజేష్‌ దండ చెప్పారు.
హీరో కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ,’ఈ సినిమా మాకు అన్నీ నేర్పింది. సంతోషాలు, ఒడిదొడుకులు..ఏవి ఎదురైనా మనమంతా కలిసే ఉన్నాం, ముందుకెళ్తున్నాం. ఈ సక్సెస్‌ మనందరికీ చాలా ముఖ్యం. డైరెక్టర్‌ నాని విషయంలో హ్యాపీగా ఉన్నాను. కొత్త డైరెక్టర్‌కు సక్సెస్‌ వస్తే అతనితో పాటు అతని ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఫీలవుతారో తెలుసు. నాని మరిన్ని హిట్‌ చిత్రాలు చేయాలి. మా ప్రొడ్యూసర్స్‌ స్ట్రాంగ్‌గా నిలబడినందుకే ఈ రోజు ఇంత పెద్ద సక్సెస్‌ మాకు దక్కింది. మనం కలిసి మళ్లీ మూవీస్‌ చేద్దాం. నాకు ఇంకా పెద్ద సక్సెస్‌లు రావొచ్చు. కానీ ఈ సినిమా మాత్రం ఎప్పటికీ ప్రత్యేకంగా మిగిలిపోతుంది. ఈ సినిమా ఎంత వసూళ్లు చేసింది అనేదాని కంటే థియేటర్స్‌లో ఫ్యామిలీ ఆడియెన్స్‌ అంతా కలిసి సినిమా చూస్తూ నవ్వుకోవడం హీరోగా ఎంతో సంతప్తిని ఇచ్చింది. పండక్కి మీ అందరినీ ఎంటర్‌టైన్‌ చేయాలనే సినిమా చేశాం. ఆ నమ్మకం నిజం కావడం హ్యాపీగా ఉంది. మీ వాడిగా భావించి ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. గతేడాది, ఈ ఏడాది దీపావళికి హిట్‌ ఇచ్చాం. మీ సపోర్ట్‌ ఉంటే వచ్చే దీపావళికి కూడా హిట్‌ సినిమా ఇస్తాను’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -