Wednesday, November 5, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనైపుణ్య మార్పిడితో సమిష్టిగా పురోగమిద్దాం

నైపుణ్య మార్పిడితో సమిష్టిగా పురోగమిద్దాం

- Advertisement -

– క్యూబా రాయబారితో మంత్రి శ్రీధర్‌బాబు భేటీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

పరస్పర నైపుణ్యాల మార్పిడి ద్వారా సమిష్టిగా పురోగమిద్దామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విజ్ఞప్తి చేశారు. మంగళవారంనాడాయన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో క్యూబా రాయబారి జువాన్‌ కార్లోస్‌ మార్సన్‌ అగులేరా, ఫస్ట్‌ సెక్రటరీ మిక్కీ డియాజ్‌ పెరెజ్‌తో భేటీ అయ్యారు. బయో టెక్నాలజీ, ఫార్మా, హెల్త్‌ కేర్‌, ఐటీ, ఏఐ, ఇన్నోవేషన్‌, అగ్రికల్చర్‌, సుస్థిర వ్యవసాయం, క్రీడా నైపుణ్యం, సాంస్కృతిక రంగాల్లో ద్వైపాక్షిక సహాకారానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌గా మార్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. టెక్నాలజీ మార్పిడి కోసం టీ-హబ్‌, టీ-వర్క్స్‌, వీ-హబ్‌ ద్వారా క్యూబా స్టార్టప్స్‌తో అనుసంధానం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వివరించారు. ఈ సందర్భంగా లైఫ్‌ సైన్సెస్‌ క్లస్టర్‌ ‘జీనోమ్‌ వ్యాలీ’ని సందర్శించాలని క్యూబా ప్రతినిధులను ఆహ్వానించారు. బాక్సింగ్‌, అథ్లెటిక్స్‌లో క్యూబా నైపుణ్యాన్ని తెలంగాణకు అందించాలని కోరారు. సమావేశంలో తెలంగాణ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ సెల్‌ డైరెక్టర్‌ మధుసూదన్‌, తెలంగాణ లైఫ్‌ సైన్సెస్‌ ఫౌండేషన్‌ డైరెక్టర్‌ శక్తి నాగప్పన్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -