మాదాపూర్ ఎస్‌ఓటీ, గచ్చిబౌలి పోలీసుల సంయుక్త దాడి
పలువురు నిందితుల అరెస్ట్ : వివరాలు వెల్లడించిన అడిషనల్ డీసీపీ ఉదరురెడ్డి
నవతెలంగాణ-మియాపూర్
ప్రయివేట్ హాస్టల్స్‌లో డ్రగ్స్ దందా నడుపుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మాదాపూర్ ఎస్‌ఓటీ, గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా హాస్టల్స్‌పై దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారు ఇచ్చిన సమాచారంతో మాదాపూర్‌లోని హూటల్ నైట్ హైలో డ్రగ్స్ తీసుకుంటున్న మరో గ్యాంగ్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో మంగళవారం అడిషనల్ డీసీపీ ఉదరురెడ్డి మీడియాకు వెల్లడించారు. సోమవారం గచ్చిబౌలిలోని టీఎన్జీవోస్ కాలనీలో ఎస్‌ఎం లక్షరీ కోలివింగ్ అండ్ పీజీ హస్టల్‌లోని గదిలో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్నట్టు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ చేశారు. అక్కడ కడపకు చెందిన తేజ, హైదరాబాద్‌కు చెందిన పకనాటి లోకేష్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిచ్చిన సమాచారంతో మాదాపూర్‌లోని హూటల్ నైట్ హైలో పార్టీ చేసుకుంటున్న వెన్నెల రవి, పెద్దమంతూర్ హర్షవర్ధన్‌రెడ్డి, మన్నె వెంకట ప్రశాంత్, షాజీర్ ముతుంగర, పృథ్వీ విష్ణువర్ధన్, కర్లపుడి ప్రెస్లీ సుజీత్, మేకల గౌతం, గుండేబోయిన నాగరాజు, గుంటక సతీష్ రెడ్డిని అదువులోకి తీసుకున్నారు. వినరు, లక్ష్మణ్, రిజ్వన్, కార్తిక్, వంశీ, హర్షతో పాటు మరో ఇద్దరు నైజీరియన్లు పరారీలో ఉన్నారు. ఆర్కిటెక్చర్ అయిన తేజ బెంగుళూర్ నుంచి ఇద్దరు నైజీరియన్ల వద్ద డ్రగ్స్ తీసుకొని హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో యువతకు సప్లరు చేస్తున్నాడు. ఇదే క్రమంలో హస్టల్ రూంలో, హౌటల్‌లో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తుండగా పోలీసులు దాడులు నిర్వహించి, వారిని అదుపులోకి తీసుకుని టెస్ట్‌కు పంపించారు. దాడుల్లో 32.14 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్, 4.67 గ్రాముల గంజాయి, 6 మొబైల్ ఫోన్స్, రూ.10 వేల నగదు, 2 ద్విచక్ర వాహనాలు, ఒక వెయింగ్ మిషన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, జ్యుడిషీయల్ కస్టడీకి తరలించారు. పౌరులు ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు తమ దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీసీపీ సూచించారు. యువత ఇలాంటి చిన్న, చిన్న ఆనందాన్ని కోరుకుంటూ తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు.
ప్రయివేట్ హాస్టల్స్‌లో డ్రగ్స్ దందా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



