Thursday, May 15, 2025
Homeజాతీయండ్రోన్‌ దాడులకు కౌంటర్‌గా భార్గవాస్త్ర

డ్రోన్‌ దాడులకు కౌంటర్‌గా భార్గవాస్త్ర

- Advertisement -

– పరీక్ష విజయవంతం
భువనేశ్వర్‌:
ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పొరుగు దేశం పాకిస్తాన్‌ ఎక్కువగా డ్రోన్లతో దాడికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రోన్‌ దాడులను ఎదుర్కొనేందుకు భారత్‌ కౌంటర్‌ డ్రోన్‌ సిస్టమ్‌ ‘భార్గవాస్త్ర’ ను సిద్ధం చేసింది. సోలార్‌ డిఫెన్స్‌, ఏరోస్పేస్‌ లిమిటెడ్‌ (ఎస్‌డీఏఎల్‌) స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ సిస్టమ్‌ను భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని గోపాల్‌పూర్‌లో గల సీవార్డ్‌ ఫైరింగ్‌ రేంజ్‌ నుంచి పరీక్షించింది. మూడుసార్లు పరీక్షించగా.. భార్గవాస్త్ర రాకెట్‌ టార్గెట్‌ను కచ్చితత్వంతో సఫలం చేసినట్టు తాజాగా అధికారులు వెల్లడించారు. ఈ భార్గవాస్త్ర డ్రోన్‌ సమూహాల ముప్పును ఎదుర్కోవడంలో చాలా కీలకమైనది.
భార్గవాస్త్ర అనేది ఒక కౌంటర్‌ డ్రోన్‌ వ్యవస్థ. డ్రోన్‌ దాడులను దీటుగా ఎదుర్కొనేందుకు దీన్ని అభివృద్ధి చేశారు. ఈ కౌంటర్‌ డ్రోన్‌ సిస్టమ్‌ 2.5 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించగలదు. ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న వైమానిక వాహనాలను కూడా ఇది గుర్తించి, గైడెడ్‌ మైక్రో బాంబులను ఉపయోగించి వాటిని నిర్వీర్యం చేస్తుంది. భార్గవాస్త్ర వ్యవస్థకు ఏకకాలంలో 64 మైక్రో క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం ఉంది. ఎక్కడికైనా సులువుగా, వేగంగా తరలించవచ్చు. ఆర్మీ ఎయిర్‌ డిఫెన్స్‌ కోసం అభివృద్ధి చేసిన మొట్టమొదటి మైక్రో క్షిపణి ఆధారిత కౌంటర్‌-డ్రోన్‌ వ్యవస్థ ఇది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -