- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలో మహిళల వసతి గృహం టాయిలెట్‌లో స్పై కెమెరాలు అమర్చిన ఘటన కలకలం సృష్టిస్తోంది. ఒక ప్రముఖ సంస్థ తమ ఉద్యోగుల కోసం వసతి గృహాన్ని నిర్వహిస్తోంది. అక్కడే ఉంటున్న ఒడిశాకు చెందిన ఒక మహిళాఉద్యోగి ఈ కెమెరాలను అమర్చింది. రహస్యంగా వీడియోలు చిత్రీకరిస్తోంది. అయితే ఆమె కదలికలపై అక్కడే ఉంటున్న మరో మహిళకు అనుమానం వచ్చింది. దీంతో ఈ కెమెరాల గుట్టు బయటపడింది. అక్కడ వసతి పొందుతున్న సుమారు రెండువేల మంది మహిళలు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితురాలిని అరెస్టు చేశారు. ఇందులో ఇంకెవరి ప్రమేయం ఉందనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -


