Thursday, November 6, 2025
E-PAPER
Homeతాజా వార్తలుస్వచ్ఛమైన ప్రేమకథ..

స్వచ్ఛమైన ప్రేమకథ..

- Advertisement -

వరలక్ష్మీ పప్పుల ప్రజెన్స్‌లో కనకదుర్గారావు పప్పుల నిర్మించిన చిత్రం ‘ప్రేమిస్తున్నా’. భాను దర్శకుడు. మర్రి రవికుమార్‌ నిర్వాహణలో సరికొత్త ప్రేమకథతో రాబోతున్న ఈ సినిమాలో సాత్విక్‌ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఈనెల 7న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను చిత్ర యూనిట్‌ నిర్వహించింది. యువ హీరోలు పూరి ఆకాష్‌, రోషన్‌ కనకాల ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ చిత్రం నుండి ఇటీవల సోల్‌ ఆఫ్‌ ప్రేమిస్తున్నా, చిత్ర ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. స్వచ్ఛమైన ప్రేమకథతో ఈ సినిమా ఆడియన్స్‌ ముందుకు రాబోతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -