రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఆహా ఒరిజినల్ ఫిల్మ్ ‘చిరంజీవ’. కుషిత కల్లపు హీరోయిన్. స్ట్రీమ్ లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాహుల్ అవుదొడ్డి, సుహాసినీ రాహుల్ నిర్మించారు. అభినయ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ నెల 7వ తేదీ నుంచి ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రెస్ ప్రీమియర్ షోను నిర్వహించారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ,’నేను చేసిన ‘ఒరేయ్ బుజ్జిగా’ ఆహాలో స్ట్రీమింగ్ అయ్యింది. ఇప్పుడు ఈ మూవీ ఈ నెల 7న ప్రీమియర్ కాబోతోంది’ అని తెలిపారు. ‘ఈ సినిమా స్క్రిప్ట్ టైమ్ నుంచి మాకు కావాల్సినంత సపోర్ట్ ఇస్తూ వస్తున్నారు ఆహా టీమ్. సినిమా కంటెంట్ బాగుందని నమ్మడం వల్లే మా మూవీకి పనిచేసిన టీమ్ అంతా ప్యాషనేట్‌గా వర్క్ చేశారు.
హీరో రాజ్‌తరుణ్ అందించిన సపోర్ట్‌ను మర్చిపోలేను. కొన్నిసార్లు హై ఫీవర్‌తో కూడా సెట్‌కు వచ్చి చిత్రీకరణ చేసేవారు. ఈ మూవీ మీ అందరినీ ఎంటర్‌టైన్‌చేస్తుంది’ అని ప్రొడ్యూసర్ రాహుల్ అవుదొడ్డి చెప్పారు. డైరెక్టర్ అభినయ కృష్ణ మాట్లాడుతూ, ’23 ఏళ్లుగా ఇండస్ట్రీలో జర్నీ చేస్తున్నాను. పది పన్నెండేళ్ల నుంచి దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తున్నాను. ఈ స్ట్రగుల్‌లో ఆహా నుంచి శ్రావణికి కొన్ని కాన్సెప్ట్స్ చెప్పాను. ఈ కథ వారికి బాగా నచ్చి మూవీ చేసేందుకు ముందుకొచ్చారు. మా ప్రొడ్యూసర్స్ రాహుల్, సుహాసినీ కాన్సెప్ట్‌ను బాగా నమ్మారు. జబర్దస్త్ చేసేప్పుడు స్కిట్స్‌లో కొత్తదనం ఉండేలా చూసుకున్నాను. ఇప్పుడు ఈ మూవీలో కూడా హీరోకు ఏజ్ మీటర్ అనే కాన్సెప్ట్ పెట్టి కొత్త ప్రయత్నం చేశాను. ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా. దర్శకుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నా’ అని తెలిపారు.
భిన్న కాన్సెప్ట్‌తో ‘చిరంజీవ’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



