Thursday, November 6, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఅడగలేని ప్రశ్నలకు సమాధానమిచ్చే సినిమా

అడగలేని ప్రశ్నలకు సమాధానమిచ్చే సినిమా

- Advertisement -

రష్మిక మందన్న, దీక్షిత్‌ శెట్టి జంటగా నటించిన సినిమా ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’. నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌, ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకుడు. ధీరజ్‌ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలు. ఈ సినిమా ఈ నెల 7న హిందీతో పాటు తెలుగులో, ఈ నెల 14న తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్‌వైడ్‌ రిలీజ్‌కు రాబోతోంది. బుధవారం ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు ధీరజ్‌ మొగిలినేని, విద్య కొప్పినీడి మాట్లాడుతూ,’ఇది మేము చేసిన సినిమా అని చెప్పడం లేదు. కానీ ఈ సినిమా ప్రతి ఒక్కరూ థియేటర్స్‌లో చూడాలి. మన పిల్లలకు చూపించాలి. ఒక తల్లిగా, సోదరిగా, బిడ్డగా నేనీ మాట చెబుతున్నా. ఎన్నో విలువలు ఉన్న సినిమా ఇది. మనం జీవితంలో ఎక్సిపీరియన్స్‌ చేస్తే గానీ చెప్పలేం. ఎన్నో ఫీలింగ్స్‌ ఉన్నా మాటల్లో వివరించలేం, మనం అడగలేని ప్రశ్నలు కూడా ఉంటాయి. అలాంటి అన్నింటికీ ఈ సినిమా సమాధానంగా నిలుస్తుంది’ అని తెలిపారు. ‘ఈ సినిమా నా కెరీర్‌లో ఒక బ్యూటీఫుల్‌ జర్నీగా మిగిలిపోతుంది.

అరవింద్‌ ఓకే చెప్పకుంటే ఈ ప్రాజెక్ట్‌ ఉండేది కాదు. ఈ సినిమాలో రష్మిక చేసిన పర్‌ఫార్మెన్స్‌ ఈ దశాబ్దంలో ఒక ఫీమేల్‌ యాక్టర్‌ తెలుగులో చేసిన బెస్ట్‌ పర్‌ఫార్మెన్స్‌గా నిలుస్తుంది. ఆమె ఎన్నో అవార్డ్స్‌, రివార్డ్స్‌కు అర్హురాలు’ అని డైరెక్టర్‌ రాహుల్‌ రవీంద్రన్‌ చెప్పారు. ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ మాట్లాడుతూ, ‘నిర్మాతగా ఎన్నో సినిమాలు చేశాను, చేస్తున్నాను. సినిమాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించాను. అందులో దాపరికం లేదు. అయితే ఈ సినిమా ద్వారా నేను సంపాదించాలనుకున్నది డబ్బు కాదు. సంతప్తి. ఈ సినిమా నిర్మించాననే విషయం ఎంతో సంతృప్తినిస్తోంది. మనకు తెలిసిన కొన్ని చెప్పలేని నిజాలను సినిమా మాధ్యమం ద్వారా చెప్పాలి అనే ఫీల్‌ ఈ కథ విన్నప్పుడు కలిగింది. రాహుల్‌ లాంటి సున్నిత మనస్కుడు, కమిటెడ్‌ పర్సన్‌ మాత్రమే ఇలాంటి సినిమాను రూపొందించగలరు. ఆయన కథ చెబుతున్నప్పుడు ఎంత ఉద్వేగంతో చెప్పారో, సినిమాను కూడా అంతే బాగా తెరకెక్కించారు. ఎన్ని పాటలున్నాయి, ఎన్ని జోక్స్‌ ఉన్నాయి, ఎంత ఎంటర్‌టైన్‌ మెంట్‌ ఉంది అని చూసే సినిమా కాదిది. అలా చూస్తే ఈ సినిమా చేయలేం. మన అక్క, చెల్లి, పిన్ని వాళ్ల మనసుల్లో ఏముంటుంది, ఎలాంటి కోర్కెలు ఉంటాయి అనుకుని మూవీ చూడాలి. ప్రతి ఫ్యామిలీలో ప్రతి పర్సన్‌ ఈ మూవీలోని కథతో రిలేట్‌ అవుతారు’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -