Thursday, November 6, 2025
E-PAPER
Homeఆటలుకరాటె అథ్లెట్‌కు కేటీఆర్‌ ఆర్థిక సాయం

కరాటె అథ్లెట్‌కు కేటీఆర్‌ ఆర్థిక సాయం

- Advertisement -

హైదరాబాద్‌ : జాతీయ స్థాయిలో 18 టోర్నమెంట్లలో పోటీపడి పతకాలు సాధించిన హైదరాబాద్‌ యువ సంచలనం, కరాటె చాంపియన్‌ సబ మాహిన్‌ను భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (కెటిఆర్‌) బుధవారం ప్రత్యేకంగా అభినందించారు. 12 ఏండ్ల సబ మాహిన్‌ డిసెంబర్‌లో దుబాయ్ వేదికగా జరుగనున్న అంతర్జాతీయ కరాటే చాంపియన్‌షిప్స్‌ పోటీలకు అర్హత సాధించింది. ఈ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు సబ మాహిన్‌కు అవసరమైన ఆర్థిక సహకారం అందిస్తానని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, స్పోర్ట్స్‌ అథారిటీ మాజీ చైర్మెన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌ రెడ్డి తదితరులు సబ మహీన్‌ను అభినందించిన వారిలో ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -