Thursday, November 6, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం25 నుంచి మత్య్సకార్మిక సంఘం రాష్ట్ర మహాసభ

25 నుంచి మత్య్సకార్మిక సంఘం రాష్ట్ర మహాసభ

- Advertisement -

సంఘం రాష్ట్ర అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు గోరెంకల నర్సింహా, లెల్లెల బాలకృష్ణ
మహాసభ పోస్టర్‌ ఆవిష్కరణ

నవతెలంగాణ-సిటీడెస్క్‌
తెలంగాణ మత్య్సకారులు, మత్య్సకార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభ ఈనెల 25, 26, 27 తేదీల్లో కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్టు సంఘం రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు గోరెంకల నర్సింహా, లెల్లెల బాలకృష్ణ తెలిపారు. హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని టీపీఎస్‌కేలో బుధవారం రాష్ట్ర మహాసభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మహాసభ సందర్భంగా 25వ తేదీన మత్స్యకారుల మహా ప్రదర్శన ఉంటుందని తెలిపారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ మహాసభకు అఖిల భారత మత్స్యకారులు మత్స్యకార్మిక సమాఖ్య ప్రధాన కార్యదర్శి పులివెల్లా స్టాన్లీ, జాతీయ, రాష్ట్ర ముఖ్య నాయకులు పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 500 మంది ప్రతినిధులు హాజరవుతారని వివరించారు. బహిరంగ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా మత్స్యకారులు తరలిరావాలని పిలుపునిచ్చారు. సంఘం 25 ఏండ్లుగా మత్యకారుల సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తున్నదని చెప్పారు.

మత్స్యకారులకు రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియో, ఉచితంగా చేెప పిల్లలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న చెరువులు, కుంటలను మత్స్యశాఖ పరిధిలోనికి తేవాలని, ప్రతి మత్స్య కారుడికీ ద్విచక్ర వాహనం, మొబైల్‌ మార్కెటింగ్‌ వాహనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. చెరువులు, కుంటల లీజులను తగ్గించాలని, కబ్జాలపై ఎన్నో పోరాటాలు చేసినట్టు గుర్తు చేశారు. కోహెడలో చేపల మార్కెట్‌ కోసం 10 ఎకరాల భూమి కేటాయించేలా సంఘం కృషి చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ ఎంవి.రమణ, సంఘం రాష్ట్ర కార్యదర్శి కొప్పు పద్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు గాండ్ల అమరావతి, బక్కి బాలమణి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు ఈగ లక్ష్మణ్‌, జిల్లా సహాయం కార్యదర్శి రాపాక వెంకటేష్‌, రంగారెడ్డి జిల్లా నాయకులు తవిడబోయిన కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -