Thursday, November 6, 2025
E-PAPER
Homeజాతీయంవారికి రూ.1.50 లక్షల వరకు ఉచిత వైద్యం

వారికి రూ.1.50 లక్షల వరకు ఉచిత వైద్యం

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి గోల్డెన్‌ అవర్‌లో వైద్యం అందిస్తే విలువైన ప్రాణాలను కాపాడొచ్చు. ఇదే ఉద్దేశంతో క్షతగాత్రులకు రూ.1.50 లక్షల వరకు ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వం సంకల్పించిందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రోడ్డు భద్రతా చర్యలపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రోజురోజుకు చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు ఆందోళన కల్గిస్తున్నాయి అని అన్నారు. రోడ్డు ప్రమాదాలలో మృతుల సంఖ్య భారీగా ఉంటుందని ఇది మరింత ఆవేదన కల్గిస్తుందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై విద్యాసంస్థల్లో రోడ్ సేఫ్టీ, రూల్స్ తదితర అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించాలని మంత్రి సూచించారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షేతగాత్రులను తీసుకెళ్లిన సమీప ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేకపోతే వెంటనే మరో ఆస్పత్రికి తరలించాలని పేర్కొంది. అందుకు ఆయా ఆస్పత్రుల వారే రవాణా సౌకర్యం కల్పించాలని కూడా స్పష్టం చేసింది. బాధితుడు డిశ్చార్జి అయిన తర్వాత వైద్యసేవలు అందించిన ఆస్పత్రి అందుకు సంబంధించిన బిల్లులను ప్యాకేజీకి అనుగుణంగా పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ సూచించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -